iDreamPost

Bangarraju : బంగార్రాజు వెనుక అసలు గుట్టు

Bangarraju : బంగార్రాజు వెనుక అసలు గుట్టు

2022 సంక్రాంతికి బంగార్రాజుని తీసుకురాబోతున్నట్టు నాగార్జున ఫిక్స్ అవ్వడం పట్ల అభిమానులు ఇప్పటికీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఒకపక్క ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ ల దెబ్బకు అంతటి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయకే వెనుకడుగు వేసే ఆలోచనలో ఉంది. ఆల్రెడీ సర్కారు వారి పాట ఏప్రిల్ కు షిఫ్ట్ అయిపోయింది. అలాంటిది మార్కెట్ కొంత డౌన్ లో ఉన్న కింగ్ ఇంత సాహసం ఎందుకు చేస్తున్నారా అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. గతంలో సోగ్గాడే చిన్ని నాయనా రిలీజ్ టైంలోనూ ఇలాంటి పోటీ ఉన్నప్పటికీ అప్పటికి ఇప్పటికి పరిస్థితుల్లో చాలా మార్పులు ఉన్నాయి. పాన్ ఇండియా గ్రాండియర్స్ కి ఎదురు నిలవడం అంత ఈజీ కాదు.

మరి ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా ఉన్నారబ్బా అనే అనుమానం రావడం సహజం. అయితే దీని వెనుక వేరే గుట్టు ఉందంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. బంగార్రాజుకి ఫండింగ్ మొత్తం జీ సంస్థ నుంచి వస్తోంది. వాళ్ళు చేసుకున్న ఒప్పందం ప్రకారం భాగస్వామి అయిన అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరిలోనే రిలీజ్ చేయాలి. ముందు వెనుకా అయినా పర్లేదు నెల మాత్రం మారకూడదు. ఒకవేళ అలా సాధ్యం కాక ఏ ఫిబ్రవరికో పోస్ట్ పోన్ చేస్తే పదిహేను శాతం దాకా రెవిన్యూలో కొత్త పడుతుందట. ఇది చిన్న మొత్తం కాదు కాబట్టి నాగార్జున ధైర్యంగా సంక్రాంతికే వద్దామని ఫిక్స్ అయ్యారని వినికిడి. ఇదంతా అఫీషియల్ టాక్ కాదు.

జరుగుతున్న ప్రచారం నాగ్ స్ట్రాటజీ రెండూ లింక్ చేసి చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తోంది. బంగార్రాజులోనూ సాలిడ్ క్యాస్టింగ్ ఉన్న సంగతి మర్చిపోకూడదు. నాగ్ రమ్యకృష్ణ చైతు కృతి శెట్టి ఇలా క్రేజీ తారాగణం సెట్ చేసుకున్నాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. సో ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ ల ఓవర్ ఫ్లోస్ అన్నీ బంగార్రాజుకే షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. యావరేజ్ టాక్ వచ్చినా చాలు హౌస్ ఫుల్ బోర్డులు పడతాయి. ఒకవేళ భీమ్లా నాయక్ కూడా రేస్ లో ఉంటాను అని చెబితే మాత్రం అప్పుడు బంగార్రాజు జనవరి చివరి వారం రిపబ్లిక్ డేని టార్గెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్లు పక్కా అయితే పూర్తి క్లారిటీ వస్తుంది

Also Read :  Kurup Report : కురుప్ సినిమా రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి