iDreamPost

ఇలాంటి కార్లు కొంటే ఇక అంతే! క్రాష్ టెస్ట్‌లో చెత్త రేటింగ్..

  • Published Mar 20, 2024 | 4:37 PMUpdated Mar 20, 2024 | 4:37 PM

దేశంలో కార్ల వినియోగం అనేది రోజురోజుకి పెరుగుతోంది. ఈ క్రమంలోనే చాలామంది కార్లను కొనుగోలు చేసే ముందు ఒకటి పది సార్లు వాటి ఫీచర్లను తెలుసుకొని కోనుగోలు చేస్తున్నారు. అయితే కార్లు కొనుగోలు విషయంలో ముఖ్యంగా వాటి ధర, పనితీరు, మైలేజీ వంటివి ముందుగానే తనిఖీ చేసుకుంటారు. కానీ వాటితో పాటు కార్ల సేఫ్టీ కూడా ముఖ్యం అంటున్నారు నిపుణులు. మరి అలాంటి భద్రత రేటింగ్ తక్కువుగా ఉన్నా జాబితాలో ప్రముఖ కార్లు కూడా ఉన్నాయి.

దేశంలో కార్ల వినియోగం అనేది రోజురోజుకి పెరుగుతోంది. ఈ క్రమంలోనే చాలామంది కార్లను కొనుగోలు చేసే ముందు ఒకటి పది సార్లు వాటి ఫీచర్లను తెలుసుకొని కోనుగోలు చేస్తున్నారు. అయితే కార్లు కొనుగోలు విషయంలో ముఖ్యంగా వాటి ధర, పనితీరు, మైలేజీ వంటివి ముందుగానే తనిఖీ చేసుకుంటారు. కానీ వాటితో పాటు కార్ల సేఫ్టీ కూడా ముఖ్యం అంటున్నారు నిపుణులు. మరి అలాంటి భద్రత రేటింగ్ తక్కువుగా ఉన్నా జాబితాలో ప్రముఖ కార్లు కూడా ఉన్నాయి.

  • Published Mar 20, 2024 | 4:37 PMUpdated Mar 20, 2024 | 4:37 PM
ఇలాంటి కార్లు కొంటే ఇక అంతే! క్రాష్ టెస్ట్‌లో చెత్త రేటింగ్..

దేశంలో కార్ల వినియోగం రోజురోజుకి పెరుగుతోంది. ఇప్పటికే ప్రతిఒక్కరి ఇంట్లో ఫ్యామిలీ, వ్యక్తిగత అవసరాల దృష్ట్యా ఈ కారును వినియోగించడం అనేది ప్రధానంగా మారిపోయింది. ఈ క్రమంలోనే కారు కొనేముందు చాలామంది దానికున్న ఫీచర్లను తెలుసుకుంటారు. ఇక ఆ ఫీచర్లనేవ ఒకటి పది సార్లు చూసుకొని కారును కొనడానికి ముందడగు వేస్తారు. మరి, వాటిలో ముఖ్యంగా కారును కొనుగోలు చేసే ముందు చూసుకోవాల్సినవి దాని ధర, పనితీరు, మైలేజీ వంటివి ముందుగానే తనిఖీ చేసుకోవాలి.అయితే వీటన్నీంటితో పాటు అతి ముఖ్యమైన అంశంన్ని చాలామంది పట్టించుకోరు. ఆ అంశం కారు భద్రత(సేఫ్టీ). వాస్తవానికి కారు కొనుగోలు చేసే అంశంలో ఇది చాలా ప్రాధానమైన అంశమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇటీవల కాలంలో దేశంల కారుల భద్రత గణనీయంగా మెరుగుపడినప్పటికీ.. ఇంకా కొన్ని మోడల్ కార్లు ఈ భద్రతా ఫీచర్ల విషయంలో వెనుకబడి ఉన్నాయి.

సాధారణంగా కారు భద్రతకు సంబంధించి క్రాష్ టెస్టింగ్ ఏజెన్సీ అయిన గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌(న్యూ కార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌) అనేది ఎక్కువగా రేటింగ్స్‌ ఇస్తుంది. అయితే ఈ రేటింగ్ ఆధారంగానే కార్ల భద్రతను నిర్ణయించడం జరుగుతుంది. ఇక ఈ విషయంలో పెద్దలకు, పిల్లలకు భద్రత రేటింగ్ అనేది విడివిడిగా ఇస్తుంది. అయితే ఈ రేటింగ్ మంచిగా ఉంటేనే ఆ కారు భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుంది. కానీ, మన దేశంలో ప్రముఖ మోడళ్లు కార్లు అనేవి ఈ రేటింగ్ విషయంలో చాలా వెనుకబడి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మారుతి ఈకో

ఈ కారుకు 2016లో క్రాష్‌ టెస్ట్‌ నిర్వహించారు. కానీ, ఆ సమయంలో ఈ కారులో పెద్దల ఆక్యుపెంట్ రక్షణక అనేది సున్నాగాను, పిల్లల భద్రతా రేటింగ్ అనేది 2 స్టార్ రేటింగ్ వచ్చింది.అందుకే వెనుకబడిన కార్ల మోడల్ల జాబితాలో ఇది మొదటి స్థానంలో నిలిచింది. పైగా ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ 5 సీట్ మినీ వ్యాన్. ఇది రోజువారీ ప్రయాణ అవసరాల కోసం విశాలమైన క్యాబిన్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా.. శక్తివంతమైన 1.2-లీటర్, 4-సిలిండర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజన్‌ను అందిస్తుంది.ఈ మోడల్ ధరలు రూ. 5.32 లక్షల(ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.

Ecco

మారుతీ సుజుకి ఎస్-ప్రెస్సో

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ప్రముఖ మైక్రో-ఎస్యూవీ, తాజా ఎన్ క్యాప్ పరీక్షలలో ఈ కారు 1-స్టార్ రేటింగ్‌ను పొందింది. ఇది పెద్దల రక్షణ కోసం సాధ్యమయ్యే 34 పాయింట్లలో 20.03 పాయింట్లను, పిల్లల భద్రతలో 3.52 పాయింట్లను స్కోర్ చేసింది. పైగా ఎస్-ప్రెస్సో పాత వేరియంట్ అయితే అది సున్నా రేటింగ్ ను పొందింది. అయితే ఈ కారు నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. దీని ధరలు రూ. 4.26 లక్షల(ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభమవుతాయి.

SPresso

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్

ఎక్కువగా ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ హ్యాచ్‌బ్యాక్ జీఎన్ క్యాప్ కారు.. భద్రతా అంచనా పరీక్షలలో 2-స్టార్ రేటింగ్‌ను అందుకుంది. ఇది పెద్దల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కోసం 49కి 15 స్కోర్ వచ్చింది.మొత్తంగా.. ఇది 66 పాయింట్లలో 22.05 సంపాదించింది. దీని ధర రూ. 5.92 లక్షల(ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.

I10 nios

మారుతి సుజుకి ఆల్టో కె10

ఈ హ్యాచ్‌బ్యాక్, బడ్జెట్ కార్ సెగ్మెంట్‌లో ఇది ప్రముఖ మోడల్. పైగా తాజా ఎన్‌సీఏపీ పరీక్షల్లో కొంచెం మెరుగైన 2-స్టార్ రేటింగ్‌ను సాధించింది. అలాగు పెద్దల భద్రత కోసం 21.67/34 పాయింట్లను, పిల్లల రక్షణ కోసం 3.52/49 పాయింట్లను స్కోర్ చేసింది. దీని ధరలు రూ. 4 లక్షల(ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభమవుతాయి.

Altok10

రెనాల్ట్‌ క్విడ్‌

తక్కువ బడ్జెట్ విభాగంలో మరొక ప్రసిద్ధ హ్యాచ్ బ్యాక్ కారుల్లో ఇది ఒకటి.  అయితే క్విడ్ ఎన్సీఏపీ రేటింగ్ లో ఇది 2 స్టార్లను సాధించింది. దీనితో పాటు పెద్దల రక్షణలో7.78 పాయింట్లు, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్లో 19.68 పాయింట్లు సాధించింది.

Kwid

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

ఇది ఒక ప్రముఖ బడ్జెట్ కారు. అయితే ఆల్టో కే10 మాదిరిగానే ఇది కూడా క్రాష్ టెస్ట్ లో 2-స్టార్ రేటింగ్ ను అందుకుంది. పైగా పెద్దల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కోసం 19.69 పాయింట్లు, పిల్లల భద్రత కోసం 3.40 పాయింట్లు సాధించింది. ఈ మోడల్ ధరలు రూ. 5.55 లక్షల (ఎక్స్  షోరూం) నుంచి ప్రారంభమవుతాయి.

Wagonr

మారుతి సుజుకి స్విఫ్ట్

హ్యాచ్ బ్యాక్ విభాగంలో బాగా స్థిరపడిన మారుతి సుజుకి స్విఫ్ట్ గ్లోబల్ ఎన్సీఏపీ నుంచి 1-స్టార్ రేటింగ్ అందుకుంది. ఇది ఫీచర్-రిచ్ ప్యాకేజీ, స్పోర్టీ పెర్ఫార్మెన్స్ ని అందిస్తోంది. అయితే ఈ కారు పెద్దల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కోసం 19.9 పాయింట్లు , పిల్లల భద్రత కోసం 16.68 పాయింట్లను స్కోర్ చేసింది.

Swift

ఇక పై జబితాలో చూసిన ప్రముఖ కార్లన్నీ క్రాష్ టెస్ట్ లోని   భద్రతా విషయంలో అతి తక్కువ రేటింగ్ కలిగివున్నాయి. కనుక ఇకపై కార్లు కొనుగోలు చేసుకున్న వారు దాని సెఫ్టీ రేటింగ్ ను కూడా తనీఖీ చేసి తీసుకోవాలసి ఉంటుంది. మరి, క్రాష్ టెస్ట్ లో అతి తక్కువ రేటింగ్ కలిగివున్న ప్రముఖ కార్ల జాబితపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి