iDreamPost

The Kashmir Files : వసూళ్ల సునామి సృష్టిస్తున్న వివాదాస్పద సినిమా

The Kashmir Files : వసూళ్ల సునామి సృష్టిస్తున్న వివాదాస్పద సినిమా

దేశవ్యాప్తంగా ది కాశ్మీర్ ఫైల్స్ సృష్టిస్తున్న వసూళ్ల ప్రభంజనానికి తలలు పండిన ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఎంత గొప్ప సినిమా అయినా వీకెండ్స్ నెమ్మదించడం సర్వ సాధారణం. కానీ ఆ ట్రెండ్ కి భిన్నంగా రోజు రోజుకి కలెక్షన్లు పెరగడం అంతు చిక్కడం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆదిలాబాద్, కరీంనగర్, రాజమండ్రిలో లాంటి పట్టణాల్లో హౌస్ ఫుల్ బోర్డులు పడటం చూస్తే ఇది ఏ స్థాయిలో జనానికి రీచ్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. కేవలం 8 రోజులకే 116 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. ఎనిమిదో రోజు బాహుబలి 2కి దగ్గరగా వెళ్లి 19 కోట్లు రాబట్టడం చిన్న విషయం కాదు. ఇప్పుడే నెమ్మదించేలా కనిపించడం లేదు.

ఇవాళ రేపు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బలంగా ఉన్నాయి. ప్రధాన కేంద్రాల్లో స్టార్ అట్రాక్షన్ ఉన్న బచ్చన్ పాండే కన్నా వేగంగా కాశ్మీర్ ఫైల్స్ నిండిపోవడం గమనార్హం. ఈలెక్కన ఈజీగా 200 కోట్లు చేరడం లాంఛనమే. వచ్చే శుక్రవారం ఆర్ఆర్ఆర్ వచ్చే దాకా కాశ్మీర్ ఫైల్స్ కు తిరుగు లేదు. దీని దెబ్బకు నార్త్ లో రాధే శ్యామ్ దారుణంగా దెబ్బ తింది. అక్షయ్ కుమార్ సైతం తన మీద ఈ స్థాయిలో ఎఫెక్ట్ పడుతుందని ఊహించలేదు. కొన్ని చోట్ల కాశ్మీర్ ఫైల్స్ దొరకని వాళ్ళు బచ్చన్ పాండే ఎంచుకుంటున్నారంటేనే పరిస్థితిని ఎక్కడి దాకా వెళ్లిందో చూడొచ్చు. క్రమంగా ఆదరణ వైరస్ లా పెరిగిపోవడం మాత్రమే అంతుచిక్కని రహస్యంగా తోస్తోంది.

మొదటి రోజు కాశ్మీర్ ఫైల్స్ 3 కోట్ల 55 లక్షలతో మొదలుపెట్టింది. స్క్రీన్లు 600 మాత్రమే. రెండో రోజు అది 8 కోట్ల 50 లక్షలకు చేరుకుంది. మూడో రోజు ఏకంగా 15 కోట్లకు పైగా వచ్చింది. అలా పెరుగుతూ ఇప్పుడు స్క్రీన్ కౌంట్ 4000 చేరువలో ఉంది. దీన్ని బట్టి భాషతో సంబంధం లేకుండా జనం కేవలం ఎమోషన్ కోసమే థియేటర్లకు వస్తున్నారన్న క్లారిటీ వచ్చేసింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ ట్రాజెడీ డ్రామాకు వచ్చే నెల ప్లాన్ చేసుకున్న ఓటిటి ప్రీమియర్ ను జీ సంస్థ వాయిదా వేసింది. మరికొంత కాలం ఆగి కంప్లీట్ రన్ ముగిశాక అప్పుడు డేట్ డిసైడ్ చేయబోతున్నారు. ప్రకటన వస్తే చాలు సబ్స్క్రైబర్స్ అమాంతం పెరిగేలా ఉన్నారు

Also Read : James & KGF : శాండల్ వుడ్ పవర్ స్టార్ కి బ్రహ్మరథం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి