iDreamPost

మే 6 – OTT అభిమానులకు ఆప్షన్లు

మే 6 – OTT అభిమానులకు ఆప్షన్లు

ఈ శుక్రవారం థియేటర్ సినిమాలే కాదు ఓటిటి కంటెంట్ కూడా స్ట్రాంగ్ గా ఉండబోతోంది. తమ సబ్స్క్రైబర్స్ ని కాపాడుకునే క్రమంలో డిజిటల్ సంస్థలు మూవీస్, వెబ్ సిరీస్ లతో ఎప్పటికప్పుడు తమ ప్లాట్ ఫార్మ్ ని అప్ డేట్ చేసుకుంటున్నాయి. అందులో భాగంగా మే6 రాబోతున్న వాటిలో మంచి అంచనాలు ఉన్నవే ఎక్కువ. అందులో మొదటిది చిన్ని(తమిళ సాని కడియం). కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ వయొలెంట్ రివెంజ్ డ్రామాలో సెల్వ రాఘవన్ మరో ముఖ్యమైన క్యారెక్టర్ చేశారు. ట్రైలర్ కట్ చూస్తే హింస ఎక్కువగా ఉందనిపిస్తోంది కానీ కీర్తి సురేష్ ఫ్యాన్స్ కి ఎలా కనెక్ట్ అవుతుందో చూడాలి. రేపు రాత్రే అందుబాటులోకి వచ్చేస్తుంది.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతున్న థార్ మీద హైప్ బాగానే ఉంది. తెలుగు ఆడియోని కూడా జోడించబోతున్నారు. అనిల్ కపూర్, హర్షవర్ధన్ కపూర్ లు నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మీద చాలా బడ్జెట్ ఖర్చు పెట్టారు. అమితాబ్ బచ్చన్ ఝున్డ్ జీ5లో రానుంది. సైరాత్ తో దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ని ఆకట్టుకున్న నాగరాజ్ మంజులే దర్శకుడు. క్రిటిక్స్ నుంచి గొప్ప ప్రశంసలు అందుకున్న ఈ స్పోర్ట్స్ డ్రామా ఓటిటిలో ఎక్కువ వ్యూస్ తెచ్చుకోవడం ఖాయం. హాట్ స్టార్ నుంచి హోమ్ శాంతి రానుండగా కన్నడ మూవీ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ ని ప్రైమ్ రేపే రిలీజ్ చేయబోతోంది. ఇవన్నీ ప్రధానంగా ఆకట్టుకుంటున్న కొత్త సినిమాలు.

ఇక థియేటర్ సంగతి తెలిసిందే. అశోక వనంలో అర్జున కళ్యాణం, జయమ్మ పంచాయితీ, భళా తందనాన, డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ అఫ్ మ్యాడ్ నెస్ హాల్లోకి వస్తున్నాయి. వీటిలో చివరి దానికే బుకింగ్స్ జోరుగా ఉన్నాయి. టాక్ వచ్చాకే వీటి భవిష్యత్తు తేలుతుంది కానీ ఓటిటిలో వాటికి ఈ టెన్షన్ ఉండదు. ఈ ఏడాది మొత్తం విపరీతమైన దూకుడు ప్రదర్శించబోతున్న అమెజాన్ ప్రైమ్ కు ధీటుగా నెట్ ఫ్లిక్స్ కూడా కొత్త ప్రకటనలకు రెడీ అవుతోంది. ప్రీ రిలీజ్ వేడుకల తరహాలో గ్రాండ్ ఈవెంట్లు చేసేందుకు ఒకదానితో మరొకటి పోటీ పడబోతున్నాయి. ఓ నాలుగు యాప్స్ లో అకౌంట్ ఉంటే చాలు థియేటర్ తో పెద్ద పనేం లేదనేలా కంటెంట్ తో పోటీ పడుతున్నాయి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి