iDreamPost

The Kashmir Files : కాశ్మీర్ ఫైల్స్ కు బ్రేకులు పడటం లేదు

The Kashmir Files : కాశ్మీర్ ఫైల్స్ కు బ్రేకులు పడటం లేదు

ఉహించని రీతిలో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేస్తున్న ది కాశ్మీర్ ఫైల్స్ 250 కోట్లకు పరుగులు పెడుతోంది. ట్రేడ్ పండితుల అంచనాలకు మించి పెర్ఫార్మ్ చేయడం చూసి నోరెళ్ళబెట్టడం ఒక్కటే మిగిలింది. కొన్న డిస్ట్రిబ్యూటర్లు కనక వర్షంలో మునిగి తేలుతున్నారు. వీక్ డేస్ లోనూ కలెక్షన్లు తగ్గకపోవడం గత కొన్నేళ్లలో ఏ మీడియం రేంజ్ సినిమాకు జరగలేదు. ఇరవై కోట్ల లోపే బడ్జెట్ తో హైదరాబాద్ వాసి అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ రియలిస్టిక్ డ్రామా ఇప్పుడు చిన్న సెంటర్లలో సైతం హౌస్ ఫుల్స్ తో ఆడుతోంది. చాలా చోట్ల అక్షయ్ కుమార్ లేటెస్ట్ మాస్ మూవీ బచ్చన్ పాండే కంటే దీని వసూళ్లే ఎక్కువగా ఉండటం గమనార్హం.

ప్రతి థియేటర్లో ఎమోషనల్ దృశ్యాలు కనిపిస్తున్నాయి. చూసిన ప్రతిఒక్కరు సోషల్ మీడియాలో ఇంకో పది మందికి చూడమని రికమండ్ చేస్తున్నారు. ఇది వైరస్ గా పాకిపోయి ఫ్యామిలీలతో సహా హాళ్లకు వస్తున్నారు. ఇప్పటిదాకా 160 కోట్లను జేబులో వేసుకున్న ఈ మూవీ ఆర్ఆర్ఆర్ వచ్చేలోగానే 200 కోట్లను టచ్ చేయడం లాంఛనమే అంటున్నారు. ట్రిపులార్ కు సౌత్ లో ఎక్కువ స్క్రీన్లు కేటాయిస్తున్న కారణంగా ఇక్కడ ప్రభావం తగ్గొచ్చేమో కానీ నార్త్ లో మల్టీ ప్లెక్సులు మాత్రం కంప్లీట్ గా కాశ్మీర్ ఫైల్స్ ని తీసేందుకు ఇష్టపడటం లేదు. కనీసం రెండు మూడు షోలైనా వేసుకునేలా షెడ్యూల్ చేసుకుంటున్నారు. ఇది ఇంకో పది రోజులు కొనసాగొచ్చు.

దీని దెబ్బకే దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి కేంద్ర ప్రభుత్వం స్పెషల్ సెక్యూరిటీ అరేంజ్ చేసింది. హిందుత్వ సంస్థలు, ప్రతినిధులు, బీజీపీ పార్టీ వర్గాలు ఒకరేమిటి అందరూ స్వచ్చందంగా కాశ్మీర్ ఫైల్స్ ప్రమోషన్ ని భుజాలకు ఎత్తుకున్నారు. వాస్తవానికి ప్రొడ్యూసర్ తరఫున జరిగిన పబ్లిసిటీ పెద్దగా ఏమి లేదు. రిలీజ్ కు ముందు కొన్ని ప్రీమియర్లు వేసి మీడియా ఒపీనియన్లు, పండిట్ల అభిప్రాయం తీసుకోవడం తప్ప ఏమి చేయలేదు. అయినా కూడా ఇంత ప్రభంజనం చూస్తే కంటెంట్ బలంగా ఉంటే ఎలాంటి ఈవెంట్లు అవసరం లేదనిపిస్తుంది. సో మరి నెక్స్ట్ పెట్టుకున్న 250 కోట్ల టార్గెట్ ని కాశ్మీర్ ఫైల్స్ దాటుతుందా లేదా చూడాలి

Also Read : Project K : ప్రభాస్ సినిమాలో పురాణాల లింకు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి