iDreamPost

‘కాశ్మీర్ ఫైల్స్’కి అవార్డు రావడంపై సీఎం అసంతృప్తి! ట్వీట్ వైరల్!

  • Author ajaykrishna Published - 09:12 AM, Sat - 26 August 23
  • Author ajaykrishna Published - 09:12 AM, Sat - 26 August 23
‘కాశ్మీర్ ఫైల్స్’కి అవార్డు రావడంపై సీఎం అసంతృప్తి! ట్వీట్ వైరల్!

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 69వ జాతీయ సినీ అవార్డుల విషయంలో తెలుగు సినిమాలు సత్తా చాటిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీకి కూడా పలు అవార్డులు దక్కాయి. ఇప్పటికే అవార్డులు గెలిచిన సినిమాలకు.. ఆర్టిస్ట్ లకు ప్రముఖుల నుండి ప్రశంసలు లభించాయి. ఆయా సినిమాల ఫ్యాన్స్ సైతం అవార్డులు రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కొన్ని సినిమాలకు అవార్డులు రాలేదని వాదన వినిపిస్తుండగా.. కొన్నింటికి అసలు అవార్డులు ఎలా ఇస్తారని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. అవార్డులు గెలుపొందిన సినిమాలను అభినందించారు.

అనంతరం.. ఒక సినిమా విషయంలో మాత్రం స్టాలిన్ అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. ట్విట్టర్ వేదికగా.. జాతీయ ఉత్తమ అవార్డులకు ఎంపికైన సినిమాలకు, దర్శకనిర్మాతలకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం. కాగా.. ఈ అవార్డులలో ఎన్నో వివాదాలు సృష్టించిన.. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమాకు నర్గీస్‌ దత్‌ పేరు మీద జాతీయ సమైక్యత అవార్డును ప్రకటించడాన్ని తప్పుపట్టారు. దేశంలో పలు వివాదాలకు తెరలేపిన కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలకు జాతీయ సమైక్యత అవార్డులను అందించడం.. దేశ సమైక్యతను దెబ్బ తీస్తుందని అభిప్రాయపడ్డారు సీఎం స్టాలిన్. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా.. ఈసారి జాతీయ ఉత్తమ చిత్రంగా ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’ నిలిచింది. హీరో మాధవన్ నటించి.. స్వీయదర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా.. సైంటిస్ట్ నంబీ నారాయణ్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఇకపోతే.. తెలుగు నుండి ఆర్ఆర్ఆర్.. పుష్ప.. సినిమాలు తమ సత్తా చాటాయి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ ఆరు కేటగిరిలలో అవార్డులు రాగా.. పుష్ప సినిమాకు బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్, మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ అవార్డులు కైవసం చేసుకున్నారు. మరోవైపు బెస్ట్ యాక్ట్రెస్ గా అలియా భట్, కృతిసనన్ లు నిలిచారు. మరి సీఎం స్టాలిన్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి