iDreamPost

The Kashmir Files : ఆర్ఆర్ఆర్ దెబ్బకు తగ్గిపోయిన కలెక్షన్లు

The Kashmir Files : ఆర్ఆర్ఆర్ దెబ్బకు తగ్గిపోయిన కలెక్షన్లు

రెండు వారాల పాటు ఏకధాటిగా బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధించిన ది కాశ్మీర్ ఫైల్స్ కథ క్లైమాక్స్ కు చేరుకుంది. ఊహించినట్టుగానే ఆర్ఆర్ఆర్ ప్రభావం దీని మీద గట్టిగా పడుతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా కనివిని ఎరుగని లాభాలు అందుకోవడంతో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు రిలాక్స్ అవుతున్నారు. 15 కోట్ల బడ్జెట్ తో రూపొంది ఊహించని విధంగా 220 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ది కాశ్మీర్ ఫైల్స్ కి ఈ వీకెండ్ కూడా వర్కౌట్ అయ్యేలా ఉంది. నిన్న 7 నుంచి 9 కోట్ల ఎస్టిమేట్ వేసిన ట్రేడ్ పండితుల అంచనాలకు భిన్నంగా 10 కోట్ల దగ్గరగా వెళ్లినట్టు సమాచారం. రేపు ఉదయానికి దీనికి సంబందించిన పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేయాలి.

ట్రిపులార్ ఎఫెక్ట్ ఎలా ఉన్నా ఇప్పటికిప్పుడు మెట్రో నగరాల్లో ది కాశ్మీర్ ఫైల్స్ ని పూర్తిగా తీసేయడం లేదు. ఇంకో రెండు వారాలు ఈజీగా కంటిన్యూ చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా మార్కెట్ లో ఉన్న సినిమాలు రెండే. ఒకటి ఇది. రెండోది ఆర్ఆర్ఆర్. బచ్చన్ పాండే డిజాస్టర్ కావడంతో చాలా చోట్ల తీసేశారు. మెయిన్ సెంటర్స్ లో మాత్రమే ఏదోలా లాగిస్తున్నారు. అందుకే కాశ్మీర్ ఫైల్స్ కి అవకాశాలు పూర్తిగా అడుగంటి పోలేదు. ఏప్రిల్ 13 బీస్ట్, 14న కెజిఎఫ్ 2 వస్తున్న నేపథ్యంలో ఆలోగా మరో పాతిక కోట్ల దాకా వచ్చేలా టార్గెట్ సెట్ చేసుకుంది. ఒకవేళ ఆర్ఆర్ఆర్ ఫ్లాప్ అయ్యుంటే కలిసి వచ్చేది కానీ రాజమౌళి చరణ్ తారక్ లు ఆ ఛాన్స్ ఇవ్వలేదు

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ది కాశ్మీర్ ఫైల్స్ ఎంతటి వివాదాలకు కేంద్ర బిందువు అయ్యిందో చూశాం. బిజెపి అండతో సినిమాను ప్రమోట్ చేశారనే విపక్షాల ఆరోపణలు జనం పెద్దగా పట్టించుకోలేదు. అసలు కాశ్మీర్ పండిట్ల విషయం గురించి అవగాహన లేనివాళ్లు సైతం ఈ కాన్సెప్ట్ కి కనెక్ట్ అయ్యారంటే ఏ స్థాయిలో ఇది జనంలోకి అర్థం చేసుకోవచ్చు. గతంలో అంచనా వేసినట్టు 300 కోట్లు అందుకోవడం అంత సులభమైతే కాదు. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. మొత్తానికి గత కొన్నేళ్లలో పెట్టిన బడ్జెట్ కి పదింతల కంటే ఎక్కువ రాబడిన ఇచ్చిన సినిమాగా ది కాశ్మీర్ ఫైల్స్ చాలా కాలం నిలిచిపోతుంది

Also Read : RRR 2nd Day Collections : రెండో రోజూ అదే జోరు కొనసాగించిన ట్రిపులార్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి