Swetha
తాజాగా .. పెట్రోల్ బంక్స్ లో ఏర్పడిన కొరత గురించి అందరికి తెలిసిందే. భాగ్యనగర వాసులు పెట్రోల్ బంక్స్ వద్ద బారులు తీరారు. గంటల కొద్దీ బంక్స్ వద్ద పడిగాపులు కాసారు. బయట పరిస్థితులు బాలేకపోయినా కూడా.. ఫుడ్ డెలివరీ బాయ్స్ మాత్రం తమ విధిని నిర్వహించడంలో ఏ మాత్రం వెనుక అడుగు వేయలేదు. వీరు ఫుడ్ డెలివరీ చేసే విధానం ఇప్పుడు వైరల్ గా మారింది.
తాజాగా .. పెట్రోల్ బంక్స్ లో ఏర్పడిన కొరత గురించి అందరికి తెలిసిందే. భాగ్యనగర వాసులు పెట్రోల్ బంక్స్ వద్ద బారులు తీరారు. గంటల కొద్దీ బంక్స్ వద్ద పడిగాపులు కాసారు. బయట పరిస్థితులు బాలేకపోయినా కూడా.. ఫుడ్ డెలివరీ బాయ్స్ మాత్రం తమ విధిని నిర్వహించడంలో ఏ మాత్రం వెనుక అడుగు వేయలేదు. వీరు ఫుడ్ డెలివరీ చేసే విధానం ఇప్పుడు వైరల్ గా మారింది.
Swetha
ప్రస్తుతం, రెండు రోజులు ట్రక్ డ్రైవర్ల సమ్మె కారణంగా.. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. ఈ క్రమంలో మంగళవారం రోజున భాగ్యనగరంలో దీని పరిణామాలు ఎక్కువగా కనిపించాయి. దాదాపు అన్ని పెట్రోల్ బంక్స్ లో నో స్టాక్ బోర్డులను పెట్టేశారు. దీనితో హైదరాబాద్ లోని వాహనదారులంతా పెట్రోల్ బంక్స్ వద్ద క్యూలు కట్టారు. కొంతమంది వాహన దారులు పడిగాపులు కాయలేక పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను ఉపయోగించుకున్నారు. కానీ, ఎవరికి ఎలా సాగిన ఫుడ్ డెలివరీ బాయ్స్ కు మాత్రం తమ విధిని నిర్వహించడం తప్పదు. దీనితో వీరు బైక్స్ పైన కాకుండా మరో మార్గంలో ఫుడ్ డెలివరీ చేయడం స్టార్ట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
పైగా పెట్రోల్ బంక్స్ లో కొరత కారణంగా పలు ప్రాంతాలలో ట్రాఫిక్ కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. దాదాపు నగరంలో ఉన్న అన్ని పెట్రోల్ బంక్స్ లోను వాహన దారులు పడిగాపులు కాస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో పెట్రోల్ కోసం బంక్ వద్దకు వచ్చిన ఓ జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ ఎంత సేపు వేచి చూసిన ఫలితం లేకపోవడంతో.. తన వాహనాన్ని పక్కన పెట్టేశాడు. ఎలాగైనా డెలివరీ అందించాలి కాబట్టి దగ్గరలో ఉన్న ఓ గుర్రాన్ని రూ.500 లకు అద్దెకు తీసుకుని.. ఏకంగా గుర్రంపైన స్వారీ చేస్తూ తన విధిని నిర్వహించాడు. ఈ సన్నివేశం హైదరాబాద్ చంచల్‌గూడ పరిసర ప్రాంతాల్లో జరిగింది. పాత బస్తీకి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ రోజు మాదిరిగానే తన విధి నిర్వహణలో భాగంగా ఫుడ్ ఆర్డర్స్ ను తీసుకున్నాడు. ఇక తన వాహనంలో పెట్రోల్ లేకపోవడం, పెట్రోల్ బంక్స్ లోను కొరత ఏర్పడడంతో.. ఇలా విచిత్ర వాహనంపై ఫుడ్ ను డెలివరీ చేయవలసి వచ్చింది.
కాగా , ఇలా రోడ్స్ పైన గుర్రంపై స్వారీ చేయడంతో ఈ సన్నివేశం అందరి దృష్టిని ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే, హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్లకు భారీగా జరిమానా, పదేళ్ల జైలు శిక్షను విధించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ ట్రక్ డ్రైవర్లు సమ్మెకు దిగిన కారణంగా పలు ప్రాంతాల్లో ఇటువంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే, ప్రస్తుతం కేంద్రం దీనిపై స్పందిస్తూ వారిని చర్చలకు ఆహ్వానించింది. దీనితో ప్రస్తుతం ఈ సమ్మెను డ్రైవర్లు తాత్కాలికంగా విరమించుకున్నారు. అంతే కాకుండా పెట్రోల్ బంక్స్ లో ఏర్పడిన కొరతను కూడా.. తక్కువ సమయంలోనే దానికి తగిన ఏర్పాట్లు చేస్తామని అధికారులు వెల్లడించారు. ఇక ప్రస్తుతం అశ్వంపై స్వారీ చేస్తూ ఫుడ్ డెలివరీ చేస్తున్న జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ వీడియో సామజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Zomato Agent Delivers Food On Horse after the pumps ran out of petrol#TruckDriversProtest #HitandRunLaw #petrolpump pic.twitter.com/wqbfbAqaUo
— rajni singh (@imrajni_singh) January 3, 2024