iDreamPost
android-app
ios-app

వీడియో: రైలు కోసం ప్లాట్ ఫామ్ పై నిలబడుతున్నారా? ఇది చూస్తే జీవితంలో అలా చేయరు!

వీడియో: రైలు కోసం ప్లాట్ ఫామ్ పై నిలబడుతున్నారా? ఇది చూస్తే జీవితంలో అలా చేయరు!

భారతదేశంలో రైల్వేస్ అతి పెద్ద రవాణా వ్యవస్థ అని అందరికీ తెలుసు. రోజుకి కోట్లమంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంటారు. ఇంత మంది ప్రయాణిస్తున్న సమయంలో అనుకోకుండా కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. రైల్వేస్ లో ప్రమాదాలు ఎక్కువగానే జరుగుతుంటాయి. కాకపోతే వాటిలో మానవ తప్పిదాలే ఎక్కువగా ఉంటాయి. రైలు పట్టాలు, ప్లాట్ ఫామ్ దగ్గర ఉన్నప్పుడు జ్ఞానేంద్రియాలు అన్నీ అలర్ట్ గా ఉండాలి. లేదంటే ఇదిగో ఈ కుర్రాడిలాగానే ప్రాణాలు కోల్పోవాల్సి రావచ్చు.

ఈ దుర్ఘటన ముంబయిలో జరిగింది. మలాడ్ రైల్వే స్టేషన్ లో మయాంక్ అనిల్(17) అనే యువకుడు ఉన్నాడు. అతని మిత్రుడు చేతులు కడుగుతుండగా.. ఇతను కూడా చేతులు కడుక్కునేందుకు వెళ్లాడు. ఇద్దరూ అటుగా రైలు వస్తున్న విషయాన్ని గమనించలేదు. ఒకరు చివరి క్షణంలో పక్కకు తప్పుకోగా మయాంక్ అనిల్ ను రైలు ఢీకొట్టింది. అతను ఒక్క ఉదుటున దూరంగా వెళ్లి పడ్డాడు. ఆ దెబ్బకు అనిల్ అక్కడికక్కడే ప్రణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రమాదంలో బాధితుల అజాగ్రత్త ఉందని కొందరు భావిస్తున్నారు. రైల్వే ప్లాట్ ఫామ్ మీద ఉన్నప్పుడు ఎంతో అప్రమత్తాగం ఉండాలని.. కానీ, వాళ్లు మాత్రం అజాగ్రత్తగా ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు లోకో పైలట్ తప్పు ఉందంటున్నారు. ఎందుకంటే ఒక స్టేషన్ ని క్రాస్ చేస్తున్న సమయంలో చిన్నగా రావాలి, హార్న్ బ్లో చేయాలి. కానీ, అతను అలా చిన్నగా వెళ్లినట్లు గానీ, హార్న్ కొట్టినట్లు గానీ అనిపించలేదు. అతని నిర్లక్ష్యం వల్లే ఓ కుర్రాడి ప్రాణం పోయినట్లు కామెంట్ చేస్తున్నారు.