P Krishna
Tirumala: ఇటీవల కొంతమంది యూట్యూబర్ తమ వెకిలి చేష్టలు, పిచ్చి వీడియోలతో రెచ్చిపోతున్నారు. రీల్స్, యూట్యూబ్ వీడియోలు తీస్తూ పలువురి మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తున్నారు.
Tirumala: ఇటీవల కొంతమంది యూట్యూబర్ తమ వెకిలి చేష్టలు, పిచ్చి వీడియోలతో రెచ్చిపోతున్నారు. రీల్స్, యూట్యూబ్ వీడియోలు తీస్తూ పలువురి మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తున్నారు.
P Krishna
ఇటీవల కొంతమంది ప్రాంక్ వీడియోలు అంటే జనాలను కన్ఫ్యూజ్ చేయడమే కాదు.. ఎంతో అసౌకర్యాలకు గురి చేస్తున్నారు. తండ్రీ కూతుళ్ల బంధంపై అసభ్యంగా కామెంట్స్ చేసి ప్రజల ఆగ్రహానికి గురైన ప్రణీత్ హనుమంతుని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తమ పిచ్చి వీడియోలతో జనాలను ఇబ్బంది పెట్టడం, మనోభావాలు దెబ్బ తీయడం పనిగా పెట్టుకున్న ఇలాంటి వారికి తగిన శాస్త జరిగిందని అంటున్నారు. ఈ ఘటన మరువక ముందే మరో యూట్యూబర్ ఏకంగా తిరుమల శ్రీవారి క్యూ లైన్ లో నిల్చొని వెకిలి చేష్టలు చేయడం, శ్రీవారి భక్తుల మనోభావాలు కించపరిచేలా వ్యవహరించడం, ఫ్రాంక్ వీడియో చేయడంపై ఇటు భక్తులు.. అటు టీటీడీ మండిపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పాపులర్ కావాలన్న యావతో కొంతమంది రీల్స్, వీడియోలతో రెచ్చిపోతున్నారు. పాటలు పాడటం, డైలాగ్స్, ఫన్నీ వీడియోలు చేయడంతో పాలు సాహస వంతమైన పనులు చేస్తూ పాపులర్ అవుతున్నారు.ఇటీవల కొంతమంది యూట్యూబర్లు లైకులు, షేర్ల కోసం వెకిలి చేష్టలు చేస్తూ, వల్గర్ కంటెంట్ తో జనాల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం అయినా తిరుమలకు వేల సంఖ్యల్లో భక్తులు దేశ, విదేశాల నుంచి తరలి వస్తుంటారు. అటువంటి కొండపై భక్తితో నడుచుకోవాల్సింది పోయి కొంతమంది ఆకతాయిలు వెకిలి చేష్టలు చేస్తూ భక్తులకు అసౌకర్యాన్ని కల్పించారు. తిరుమలలో తమిళ యూట్యూబర్స్ రెచ్చిపోయారు..ప్రాంక్ వీడియోలతో భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ క్యూ లైన్లో టీటీఎఫ్ వాసన్ అనే యూట్యూబర్ టీటీడీ ఉద్యోగిలా నటిస్తూ కంపార్ట్ మెంట్ తాళాలు తీస్తున్నట్లు చేశారు. దాంతో భక్తులు అటు వైపు పరుగులు పెట్టారు.. భక్తులు అక్కడికి రావడంతో అది ప్రాంక్ అంటూ వెకిలిగా నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
పవిత్ర స్థలంలో ఇలాంటి పిచ్చి వేశాలు వేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు భక్తులు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్ లో నిల్చున్న భక్తులను ఆట పట్టించేలా యూట్యూబర్ చేసిన ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో టీటీడీ చర్యలు చేపట్టింది. ఎంతో పటిష్టమైన భద్రత, నిఘా ఉండే ప్రదేశంలో కొంతమంది యువకులు మొబైల్ ఫోన్లు తీసుకురావడంతో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. టీటీడీ అధికారులు ఈ వీడియోపై సీరియస్ అయ్యారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సిబ్బందిని ఆదేశించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను తమిళనాడుకు పంపినట్లు సమాచారం.
తిరుమల వేంకటేశ్వర స్వామి వారి క్యూలైన్లో టీటీఎఫ్ వాసన్ గ్యాంగ్ తీసిన వీడియోలు వైరల్ https://t.co/V2DTjBib0B pic.twitter.com/1q4jtNyrH2
— Telugu Scribe (@TeluguScribe) July 11, 2024