iDreamPost
android-app
ios-app

హీరోయిన్ రేంజ్‌లో కోట్లు సంపాదిస్తున్న యువతి.. యూట్యూబ్‌లో ఆ పాఠాలు చెబుతూ..

Nischa Shah: ఏడాదికి 2 కోట్లు సంపాదించే బ్యాంక్ జాబ్ వదిలేసి యూట్యూబర్ గా మారి అంతకు మించి ఆదాయాన్ని పొందుతున్నది. సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా సంపాదిస్తున్నది యువతి.

Nischa Shah: ఏడాదికి 2 కోట్లు సంపాదించే బ్యాంక్ జాబ్ వదిలేసి యూట్యూబర్ గా మారి అంతకు మించి ఆదాయాన్ని పొందుతున్నది. సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా సంపాదిస్తున్నది యువతి.

హీరోయిన్ రేంజ్‌లో కోట్లు సంపాదిస్తున్న యువతి.. యూట్యూబ్‌లో ఆ పాఠాలు చెబుతూ..

టాలెంట్ ఉంటే సంపాదించడానికి బౌండరీలేమీ ఉండవని నిరూపిస్తున్నారు నేటి యువత. టెక్నాలజీని అందిపుచ్చుకుని అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమలోని క్రియేటివిటితో లక్షలు, కోట్లు కొల్లగొడుతున్నారు. ఇదే రీతిలో ఓ యువతి యూట్యూబ్ ద్వారా ఏడాదికి కోట్లాది రూపాయలు సంపాదిస్తూ అదరగొడుతోంది. సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా ఆ రేంజ్ లో ఆర్జిస్తున్నది. ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో విషయం ఏంటంటే ఆ యువతి బ్యాంక్ ఉద్యోగి. ఏడాదికి రెండు కోట్లు వచ్చే బ్యాంక్ జాబ్ ను వదిలిపెట్టి యూట్యూబర్ గా మారింది. యూట్యూబ్ లో ఫైనాన్స్ పాఠాలు చెబుతూ ఏడాదికి 8 కోట్లు సంపాదిస్తున్నది. ఇంతకీ ఆమె ఎవరంటే?

గతంలో ఆమె లండన్‌లో ఓ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్. బ్యాంకు ఉద్యోగిగా దాదాపు పదేళ్లు పనిచేసింది. అయితే ఆ ఉద్యోగం ఆమెకు సంతృప్తినివ్వలేదు. మంచి జీతం మరింత ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం కూడా ఉంది. కానీ ఆ జాబ్ వదిలేసి.. కంఫర్ట్ జోన్ లో బ్రతికేకంటే.. రిస్క్ చేసి లైఫ్ లో సక్సెస్ సాధించాలని నిర్ణయించుకుంది. వెంటనే ఆ ఉద్యోగాన్ని వదిలేసింది. యూట్యూబర్ గా మారి ఉద్యోగం ద్వారా సంపాదించేదానికన్న డబుల్ రెట్లు సంపాదిస్తూ ఔరా అనిపిస్తున్నది. ఆమె మరెవరో కాదు ఆమె పేరే నిశ్చా షా. క్రియేటివిటీ లేని ఆ బ్యాంక్ జాబ్, ఇతరులకు సాయం చేస్తూ ఆర్థికంగా ఎదగాలన్న ఆమె సంకల్పం తనను యూట్యూబర్ గా మార్చింది.

అయితే బ్యాంక్ జాబ్ వదిలేయడానికంటే ముందే నిశ్చా షా యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించింది. అయితే 1కే సబ్ స్క్రైబర్లు చేరుకోవడానికి 11 నెలలు పట్టిందని ఆమె తెలిపింది. ఆ తర్వాత 2022లో తన లైఫ్ గురించి ఓ వీడియో తీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడంతో లక్ మారిపోయిందని చెప్పింది. ఆ వీడియోకు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సబ్ స్క్రైబర్ల సంఖ్య 50కే కు చేరిందని తెలిపింది. దాంతో 2023లో బ్యాంక్ జాబ్ వదిలేసి ఫుల్ టైమ్ యూట్యూబర్ గా మారింది.

యూట్యూబ్‌లో పర్సనల్‌ ఫైనాన్స్‌కు సంబంధించిన సలహాలు, సూచనలు ఇస్తూ వీడియోలు చేయడం మొదలుపెట్టింది. అవి కాస్త వైరల్ కావడంతో ఏడాది కాలంలోనే 8 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తోంది. అయితే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఆమె ఉద్యోగం వదిలేసి యూట్యూబర్ గా సక్సెస్ సాధించిందని మీరు కూడా అలా చేస్తే మొదటికే మోసం రావొచ్చు. ఎందుకంటే ఇది అందరికీ సాధ్యపడకపోవచ్చు. అలాంటి రిస్క్ తో కూడిన నిర్ణయాలు తీసుకునేముందు ఆలోచించుకుని అడుగేస్తే మంచిది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి