iDreamPost
android-app
ios-app

తండ్రీ కూతుళ్లపై అసభ్యకర కామెంట్స్.. క్షమాపణలు కోరిన నటుడు!

  • Published Jul 08, 2024 | 11:14 AM Updated Updated Jul 08, 2024 | 11:14 AM

Youtuber Praneeth Hanumanthu: ఇటీవల సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు నవ్వులు పూయించే విధంగా ఉంటే.. కొన్ని ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటున్నాయి.

Youtuber Praneeth Hanumanthu: ఇటీవల సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు నవ్వులు పూయించే విధంగా ఉంటే.. కొన్ని ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటున్నాయి.

  • Published Jul 08, 2024 | 11:14 AMUpdated Jul 08, 2024 | 11:14 AM
తండ్రీ కూతుళ్లపై అసభ్యకర కామెంట్స్.. క్షమాపణలు కోరిన నటుడు!

నేటి సమాజంలో సోషల్ మీడియా మనిషి జీవన ప్రమాణాలపై కీలక ప్రభావం చూపిస్తుంది. ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాని ఏదో ఒకర రూపంలో ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎన్నో రకాలు వీడియోలు దర్శనమిస్తుంటాయి. కొంతమంది రీల్స్, యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులర్ అవుతున్నారు. సాధారణంగా సోషల్ మీడియాలో వచ్చే వీడియోస్ కి కామెంట్స్ చేయడం, ట్రోలింగ్ చేయడం తెలిసిందే. తండ్రీ కూతుళ్లకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు, ఓ నటుడు, యూట్యూబర్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. అవి కాస్త వైరల్ కావడంతో అతనిపై తీవ్ర విమర్శలు రావడంతో క్షమాపణలు కోరాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటించిన మూవీ ‘హరోం హర’ మంచి టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో సెల్వ మణికాయం బుజ్జులుగా కంటెంట్ క్రియేటర్ అయిన ప్రణిత్ హనుమంతు నటించాడు. యాక్షన్ సన్నివేశాల్లో ప్రణిత్ హనుమంతుకి మంచి మార్కులే పడ్డాయి. ఈ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రణీత్ తాజాగా ఓ కాంట్రవర్సీకి తెరలేపాడు. ప్రణిత్ యాక్టర్ కంటే కంటెంట్ క్రియేటర్, యూట్యూబర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ మధ్య తన యూట్యూబ్ వేదికగా తెలుగు సినిమాలను తిట్టడమే పనిగా పెట్టుకోవడంతో తీవ్ర విమర్శల పాలయ్యాడు ప్రణిత్ హనుమంతు. ఓ తండ్రీ కూతురు కి సంబంధించిన వీడియోపై డార్క్ కామెడీ పేరుతో అసభ్య వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్, నటుడు ప్రణీత్ హనుమంతుపై తీవ్ర విమర్శలు, ఆగ్రహం వ్యక్తం అవుతుంది. దీంతో ప్రణీత్ తండ్రీ కూతుళ్ళకు బహిరంగంగా క్షమాపణలు కోరారు.

ఓ తండ్రి తన కూతురితో కలిసి సరదాగా వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోపై డార్క్ కామెడీ పేరుతో యుట్యూబర్ ప్రణిత్ హనుమంతు విచ్చల విడిగా కామెంట్స్ చేశాడు. తండ్రీ కూతుళ్ళ బంధాన్ని చెడు కోణంలో చూపిస్తూ నీచంగా మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు.. ఆ తండ్రీ కూతుళ్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ప్రణీత్ హనుమంతు‌ని ఫోక్సో చట్టం కింద అరెస్ట్ చేయాలని పోలీసులకు ట్యాగ్ చేశారు. అది గమనించి ప్రణీత్ అభ్యంతరకరమైన భాగాలను తీసి మరో పోస్ట్ పెట్టాడు. ఈ క్రమంలోనే ఓ వీడియో విడుదల చేస్తూ.. నన్ను క్షమించండి. ఆ వీడియో నుంచి అసభ్యకర వ్యాఖ్యలను తొలగించాను.  కంటెంట్ క్రియేటర్ గా నా ప్రయత్నం అందరిని సంతోషంగా ఉంచడమే. నా వల్ల తప్పు జరిగింది.. దయచేసి నా తప్పును క్షమించండి,   తాను చేసింది తప్పే ఇకపై ఇలాంటి వాటికి దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు.’ అంటూ తండ్రీ కూతురుకి క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Praneeth Hanumantu (@p.hanumantu)