Swetha
చాలా మంది వారు ఉద్యోగాలు చేసే సమయంలో చేయలేని పనులన్నీ కూడా.. ఉద్యోగ విరమణ తర్వాత చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ జంట ఇలా తమ ఉద్యోగ విరమణ ఎం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. ఇంతకీ ఎం చేస్తున్నారంటే..
చాలా మంది వారు ఉద్యోగాలు చేసే సమయంలో చేయలేని పనులన్నీ కూడా.. ఉద్యోగ విరమణ తర్వాత చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ జంట ఇలా తమ ఉద్యోగ విరమణ ఎం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. ఇంతకీ ఎం చేస్తున్నారంటే..
Swetha
భవిష్యత్తులో సుఖంగా సంతోషంగా జీవించేందుకు ఎంతో మంది ఉద్యోగులు తెగ కష్టపడుతూ ఉంటారు. దీనితో వారు చేయాలనుకునే చిన్న చిన్న సరదాలన్నటిని కూడా ఉద్యోగ విరమణ తర్వాత చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న జెనెరేషన్ లో ఇవన్నీ కనిపించకపోవచ్చు కానీ ఒకప్పటి జెనెరేషన్ అయితే.. తమ కోసం తమ పిల్లల కోసం.. చిన్న చిన్న సరదాలను కూడా త్యాగం చేస్తూ ఉండేవారు. ఇలా వారి ఉద్యోగ విరమణ తర్వాత.. వారు చేయాలనుకునే పనులను చేస్తూ ఉండేవారు. వారి సమయం మొత్తాన్ని కుటుంబానికి, జీవిత భాగస్వామికి కేటాయించేవారు. ఇప్పుడు ఇలాంటి ఓ రిటైర్డ్ జంటకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జంట ఎం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఓ రిటైర్డ్ జంట సొంతంగా ఒక ఇంస్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించారు. ఇక తమ శేషజీవితాన్ని ఆనందంగా గడిపేందుకు రోడ్ ట్రిప్ ను మొదలుపెట్టారు ఈ జంట. రోడ్ ట్రిప్ అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కనీసం ఒక్కసారైనా వెళ్లాలనుకునే ఓ కోరిక. ఇక ఇప్పుడు ఈ జంట తమ కలను సాకారం చేసుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోస్ ను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు కూడా. ఈ జంట జనవరిలో ఢిల్లీ నుండి కన్యాకుమారి వరకు తమ 52 రోజుల ప్రయాణాన్ని ప్రారంభించారు. దీనికోసం వారు ఓ చిన్న వ్యాన్ ను కొనుగోలు చేశారు. అదే వ్యాన్ లో చిన్న వంటగదిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా లో షేర్ చేయడంతో.. ఆ వీడియోస్ నెట్టింట తెగ షికార్లు చేస్తున్నాయి. ఈ వీడియో చూసిన వారంతా ఫిదా అవ్వకుండా ఉండలేరు.
వారిద్దరూ వీడియోలో కనిపించినట్లుగానే.. తామిద్దరం రిటైర్డ్ ఉద్యోగులం అని, వారి జీవితంలో వారికీ అది సెకండ్ ఇన్నింగ్స్ గా భావిస్తున్నాం అని చెప్పుకొచ్చారు. నెట్టింట షేర్ చేసిన వీడియోను గమనిస్తే.. వారు రోడ్ ట్రిప్ లో భాగంగా..లంచ్ ప్రిపేర్ షేర్ చేసుకోవడం కోసం దారిలో ఆగినప్పుడు.. వారిద్దరూ కలిసి లంచ్ ను తయారు చేసుకోడం, ప్రశాంతంగా ఎంజాయ్ చేయడం కనిపిస్తుంది. ఇక దీనిని చూసిన నెటిజన్లు.. ఇది కదా జీవితం అంటే అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది వీరిని ప్రశంసలతో ముంచేస్తున్నారు. ఏదేమైనా అన్ని రోజులు తమ కోసం తమ పిల్లల కోసం కస్టపడి రిటైర్డ్ అయిన వారందరికీ కూడా.. ఇలాంటి ప్లాన్స్ ఉంటే .. వారికి జీవితంలో అది నిజంగా బెస్ట్ డేస్ అవుతాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.