కజిరంగా నేషనల్ పార్క్‌లో కనిపించిన అరుదైన గోల్డెన్ టైగర్!

Rare Golden Tiger Sighting: ప్రస్తుతం పులుల సంఖ్య చాలా వరకు అంతరించిపోతున్న జాతిగా పరిగణించబడుతుంది. ఈ క్రమంలోనే కజిరంగా నేషనల్ పార్క్‌లో ఓ అరుదైన పులి అందరినీ ఆకర్షించింది.

Rare Golden Tiger Sighting: ప్రస్తుతం పులుల సంఖ్య చాలా వరకు అంతరించిపోతున్న జాతిగా పరిగణించబడుతుంది. ఈ క్రమంలోనే కజిరంగా నేషనల్ పార్క్‌లో ఓ అరుదైన పులి అందరినీ ఆకర్షించింది.

ప్రపంచంలోని మొత్తం పులుల్లో దాదాపు డెబ్బై శాతం వరకు భారత్ లోనే ఉన్నాయని అంటారు. పులుల సంరక్షణ అంశంలో భారత దేశం అనుసరిస్తున్న విధానాలు ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా మారాయి. నాలుగేళ్లకు ఒకసారి అభయారణ్యాల్లో పులుల లెక్కింపు ప్రక్రియ ఏకంగా గిన్నిస్ రికార్డులకెక్కింది. పులుల్లో పలు రకాలు ఉంటాయి. సాధారణంగా పులులు ఆరెంజ్, బ్రౌన్ చర్మంపై నల్లటి చారలు కలిగి ఉంటాయి. చాలా అరుదుగా తెల్లపులి, నల్లటి చర్మం పై పసుపు పచ్చ చారలు ఉన్న పులులు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. తాజాగా కాజీరంగా జాతీయ పార్క్ లో ఒక అరుదైన పులి కంటపడింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

అస్సాం రాష్ట్రంలో.. గౌహౌతి-జోర్హాత్ జాతీయ రహదారి సమీపంలో కాజిరంగా జాతీయ పార్క్ ఉంది. ఇది 430 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ పార్కు ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలకు ప్రసిద్ది. ఈ పార్కుని యునెస్కో వారు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించడం మరో విశేషం. కాజిరంగ జాతీయ పార్కులో ఖడ్గ మృగాలతో పాటు ఏనుగులు, బెంగాల్ టైగర్, ఇతర జంతువులతో పాటు సాంక్చువరీ పక్షులు ఎక్కువగా ఉంటాయి. తాజాగా కజిరంగా నేషనల్ పార్క్ లో అరుదైన గోల్డెన్ టైగర్ (బంగారు వర్ణ పులి) కనిపించింది. ఈ విషయాన్ని అస్సాం సీఎం హింత బిస్వా శర్మ బంగారు వర్ణ పులిని మీడియాలో షేర్ చేస్తూ.. ‘మెజెస్టిక్ బ్యూటీ అంటే ఇదే.. కాజిరంగా నేషనల్ పార్క్ లో అరుదైన పులిని చూసే అదృష్టం దక్కింది’ అని రాశారు.

ప్రస్తుతం బంగారు పుల సంఖ్య బాగా తగ్గిపోతుంది. వాస్తవానికి గోల్డెన్ టైగర్ మొదటి ఫోటో 2020 లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అప్పట్లో ప్రపంచంలో ఇదే ఏకైక గోల్డెన్ టైగర్ అంటూ ప్రచారం జరిగింది. కానీ, కజిరంగా జాతీయ పార్కు‌లో అలాంటివి నాలుగు పులులు ఉన్నాయని వార్తలు వచ్చాయి. బంగారు పులులు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. తాజాగా కనిపించిన ఈ అరుదైన పులికి సంబంధించిన ఫోటోకి సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన లభిస్తుంది. చాలా మంది ఈ ఫోటోపై తమదైన స్టైల్లో కామెంట్స్ పెడుతున్నారు. ఈ పులి సాధారణ పులుల కంటే పసుపు లేదా నారింజ వర్ణంలో చాలా బలిష్టంగా ఉంటుంది. ఈ ఫోటోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments