iDreamPost
android-app
ios-app

వీడియో: తాతకు మనవడి అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్.. కళ్లు చెమ్మగిల్లుతాయి..

  • Published Apr 05, 2024 | 9:35 PM Updated Updated Apr 05, 2024 | 9:35 PM

Pilot Big Surprise For His GrandFather: ప్రతి మనవడికి వాళ్ల తాత సూపర్ హీరోలా కనిపిస్తాడు. ఎందుకంటే చిన్నప్పుడు అన్ని విషయాలు నేర్పేది ఆయనే కాబట్టి. అయితే ఆ తాతకు అందరు మనవళ్లు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేరు. కానీ, ఈ మనవడు మాత్రం అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు.

Pilot Big Surprise For His GrandFather: ప్రతి మనవడికి వాళ్ల తాత సూపర్ హీరోలా కనిపిస్తాడు. ఎందుకంటే చిన్నప్పుడు అన్ని విషయాలు నేర్పేది ఆయనే కాబట్టి. అయితే ఆ తాతకు అందరు మనవళ్లు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేరు. కానీ, ఈ మనవడు మాత్రం అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు.

  • Published Apr 05, 2024 | 9:35 PMUpdated Apr 05, 2024 | 9:35 PM
వీడియో: తాతకు మనవడి అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్.. కళ్లు చెమ్మగిల్లుతాయి..

ప్రతి పిల్లాడికి తాత, నానమ్మలతో ఎన్నో అద్భుతమైన క్షణాలు ఉంటాయి. కనేది తల్లిదండ్రులే అయినా అల్లారు ముద్దుగా పెంచేది మాత్రం తాతానానమ్మలే. వారికి మనవడు, మనవరాలు అంటే ఎనలేని ఆప్యాయత ఉంటుంది. వారిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు. పిల్లల్ని ఎంతో గారం చేస్తారు. ఏ మనవడు ఫస్ట్ సైకిల్ ఎక్కినా, బైక్ ఎక్కినా అది తాతదే అయి ఉంటుంది. మొదట లోకాన్ని చూడటం మొదలు పెట్టేది తాత భుజాల మీద అనే చెప్పాలి. అలాంటి తాతకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే అవకాశం అందరూ మనవళ్లకు రాకపోవచ్చు. కానీ, ఈ మనవడు మాత్రం కాస్త లక్కీ అనే చెప్పాలి. తన తాతకు అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాతకు మనవడు అంటే ఒక హీరో. చిన్నప్పటి నుంచి అలాగే చూసుకుంటారు. బండి మీద ఎక్కించుకుని ఊరు మొత్తం తిప్పి తీసుకొస్తారు. అలాగే ఈ తాత కూడా తన మనవడిని తన టీవీఎస్ 50పై ఎక్కించుకుని చిన్నప్పుడు ఊరంతే తిప్పేవాడు. ఆ మనవడు ఇప్పుడు పైలట్ అయ్యాడు. ఆ పైలట్ మనవడు తన తాతకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. విషయం ఏంటంటే.. తమిళనాడుకు చెందిన ప్రదీప్ కృష్ణన్ పైలట్ గా చేస్తున్నాడు. అతను ఫ్లై చేసే ఇండిగో విమానంలో తన కుటుంబం కూడా ఉంది. తన తల్లి, తాత, నానమ్మలు అదే విమానంలో ప్రయాణిస్తున్నారు.

చిన్నతనంలో తనను టీవీఎస్ 50 మీద ఎక్కించుకుని తిప్పిన తాతకు ఈ పైలట్ మనవడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాడు. తన కుటుంబం ఆ విమానంలో ఉన్న విషయాన్ని ప్రయాణికులతో పంచుకున్నాడు. అలాగే తన తాత గురించి ప్రత్యేకించి చెప్పుకొచ్చాడు. తన చిన్నతనంలో ఎక్కువ శాతం తాత బండి మీద వెనకాల కూర్చుని తిరిగిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. ఇలా తన తాత మొదటిసారి విమానం ఎక్కడం.. అది కూడా తాను ఫ్లై చేసే విమానం ఎక్కడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. తాతను పరిచయం చేస్తూ.. అందరూ హాయ్ చెప్పాలని ప్రయాణికులను కోరాడు. ప్రయాణికులు అంతా చప్పట్లు కొడుతూ తాతకు స్వాగతం పలికారు.

తన కుమారుడు చేసిన ఈ పని చూసి ఆ తల్లి కళ్లు చెమ్మగిల్లాయి. ఈ వీడియో తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ప్రతి పైలట్ డ్రీమ్ తమ కుటుంబాన్ని తాము నడిపే విమానంలో తిప్పడమే అంటూ చెప్పుకొచ్చాడు. పైలట్ ప్రదీప్ పోస్ట్ చేసిన ఈ వీడియో చూసి నెటిజన్స్ ఎమోషనల్ అవుతున్నారు. ఇలాంటి మనవడు ఉన్నందుకు ఆ తాత ఎంతో లక్కీ అంటూ చెప్తున్నారు. నిజంగా ప్రదీప్ ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ మనవడు తాతకు ఇచ్చిన గిఫ్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Pradeep Krishnan (@capt_pradeepkrishnan)

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabetgrandpashabet