iDreamPost
android-app
ios-app

వీడియో: చిన్నారిపై ఆవు దాడిలో.. ఈ విషయాన్ని గమనించారా?

వీడియో: చిన్నారిపై ఆవు దాడిలో.. ఈ విషయాన్ని గమనించారా?

ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఒక బాలికపై ఆవు దాడి చేసింది. ఈ ఘటన చెన్నైలో జరిగింది. ఒక తల్లి తన పిల్లలను పాఠశాల నుంచి తీసుకెళ్తూ ఉంది. వీళ్లకంటే కాస్త ముందు ఆవు, దాని దూడ వెళ్తున్నాయి. ఆ ఆవు ఒక్కసారిగా బాలికపై దాడికి దిగింది. దాని పెద్ద కొమ్ములతో బాలికను ఎత్తి నేలకేసి కొట్టింది. అక్కడితో ఆగకుండా కాళ్లతో తొక్కుతూ కొమ్ములతో కుమ్ముతూ తీవ్రంగా గాయ పరిచింది. ఆవు నుంచి కుమార్తెను కాపాడుకునేందుకు ఆ తల్లి ఎంతో ప్రయత్నించింది. పక్కనే ఉన్న ఇటుక రాళ్లు ఆవుపైకి విసురుతూ ఉంది.

కానీ, ఆ ఆవు మాత్రం దాడిని ఆపలేదు. తర్వాత కొందరు ఆవుపై రాళ్ల దాడి చేశారు. చేతికి దొరికిన దాంతో కొట్టేందుకు ప్రయత్నించారు. కొద్దిసేపటికి ఒకతను కర్ర తీసుకుని వచ్చి ఆవును కొట్టగా అప్పుడు అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. తర్వాత ఆ బాలికను ఆస్పత్రికి తరలించారు. ఈ మొత్తం ఘటన అక్కడ ఉన్న ఒక ఇంటి సీసీకెమెరాలో రికార్డ్ అయింది. అయితే ఈ వీడియో చూసిన వాళ్లంతా ఆవు దాడినే చూస్తున్నారు. కానీ, కొందరు నెటిజన్స్ ఆ వీడియోలో ఉన్న రెండో కోణాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. ఆ సీసీకెమెరా ఫిక్స్ చేసిన ఇంట్లో నుంచి దాడి జరుగుతున్న సమయంలో కొందరు బయటకు వస్తారు. ముందు ఇద్దరు మహిళలు రాగా.. వాళ్ల తర్వాత ఇద్దరు పురుషులు కూడా వస్తారు. అయితే వాళ్లు సహాయం చేసేందుకు ప్రయత్నించకపోగా.. ఏదో వేడుక చూస్తున్నట్లు అలాగే ఉండిపోవడంపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆ వ్యక్తుల్లో అసలు చలనం కూడా లేదని.. ఏదో సినిమా చూస్తున్నట్లు అలాగే ఉండిపోయారని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనిషిగా వారిలో మానవత్సం అనేది లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ చిన్నారి దయనీయస్థితి చూసి కూడా వారు కాస్త కూడా చలించలేదు. వాళ్లు ఆవును ఆపకపోయినా కనీసం ప్రయత్నిస్తున్న వారి చేతికి ఒక కర్ర ఇచ్చినా సంతోషించే వాళ్లం అంటూ కామెంట్ చేస్తున్నారు. కనీసం స్పందన లేకుండా వాళ్లు బొమ్మల మాదిరిగా ఎలా ఉండగలిగారు అంటూ ప్రశ్నిస్తున్నారు. పాపను కాపాడేందుకు ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఆ ఇంట్లో నుంచుని చోద్యం చూసిన వాళ్లను మాత్రం తిట్టిపోస్తున్నారు. మనిషి అనే వాళ్లు ఎవరూ వారిలా మాత్రం ప్రవర్తించరు అంటూ స్పందిస్తున్నారు. ఈ దాడి ఘటనలో వాళ్లు చేసింది కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.