iDreamPost
android-app
ios-app

భార్యని చదివించిన డెలివరీ బాయ్! జాబ్ రాగానే ప్రియుడితో!

  • Published Oct 05, 2023 | 1:55 PM Updated Updated Oct 07, 2023 | 12:26 PM
  • Published Oct 05, 2023 | 1:55 PMUpdated Oct 07, 2023 | 12:26 PM
భార్యని చదివించిన డెలివరీ బాయ్! జాబ్ రాగానే ప్రియుడితో!

పైన ఫొటోలో చూడటానికి అందంగా కనిపిస్తున్న యువతి పేరు ప్రియా కుమారి. ఆమెకు 2020లో టింకూ అనే యువకుడితో తల్లిదండ్రులు వివాహం జరిపించారు. కొన్నాళ్ల తర్వాత భార్య కోరిక మేరకు భర్త అప్పు చేసి మరీ భార్యను నర్సింగ్ చదివించాడు. అలా చదువుకుంటూనే ఈ అమ్మాయి ఓ ఆస్పత్రిలో శిక్షణ కూడా తీసుకుంటుంది. దీంతో భర్త టింకూ నా భార్య డాక్టర్ అంటూ నలుగురికి చెప్పుకుని ఎంతో మురిసిపోయాడు. అయితే ఈ క్రమంలోనే భార్య ప్రియా కుమారి ఉన్నట్టుండి భర్తకు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఈ దెబ్బతో భర్తకు ఏం చేయాలో తెలియక తల పట్టుకున్నాడు. ఇంతకు ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్ గొద్దా జిల్లాలోని ఓ ప్రాంతంలో టింకూ యాదవ్-ప్రియా కుమారి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 2020లో వివాహం జరిగింది. భర్త పిజ్జా డెలవరీ చేస్తూ కుటుంబాన్నిపోషించేవాడు. అయితే పెళ్లైన కొంత కాలానికి భార్య ప్రియా కుమారి నేను నర్సింగ్ చదువుతానని భర్తతో చెప్పింది. భార్య ఇష్టాన్ని కాదనని భర్త.. సరేనంటూ బ్యాంక్ లో రూ.2.5 లక్షలు లోన్ తీసుకుని మరీ చదివించాడు. అప్పటి నుంచి ఆ యువతి రోజూ కాలేజీకి వెళ్తూనే ఓ ఆస్పత్రిలో ట్రైనింగ్ తీసుకుంది. అయితే నా భార్య కాబోయే డాక్టర్ అంటూ టింకూ యాదవ్ గ్రామస్తులకు, బంధువులకు చెప్పుకుని ఎంతో సంతోషపడేవాడు. కానీ, ఆ సంతోషం మూన్నాళ్ల ముచ్చటే అని టింకూ తెలుసుకోలేకపోయాడు. ఇంతకు ఏం జరిగిందంటే?

సెప్టెంబర్ 19న భార్య ప్రియా కుమారి కాలేజీకి వెళ్లి ఆ రోజు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఖంగారు పడ్డ భర్త స్థానిక ప్రాంతాల్లో అంతా వెతికాడు. కానీ, ప్రియా ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక అతనికి ఏం చేయాలో తెలియక వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పటి నుంచి ప్రియా కుమారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రియా కుమారి భర్తకు వాట్సాప్ లో.. నేను నా ప్రియుడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నానని చెప్పి ఊహించని షాకిచ్చింది. ఇంతే కాకుండా పెళ్లి చేసుకున్న ఫోటోలు కూడా భర్తకు పంపింది. వాటిని చూసి టింకూ ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. భార్య చేసిన పనికి గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, బంధువులు ప్రియా కుమారి ఇంత పని చేస్తుందని అస్సలు అనుకోలేదని అనుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కష్టపడి భార్యను నర్సింగ్ చదివిస్తే.. ప్రియుడితో లేచిపోయి పెళ్లి చేసుకున్న భార్య నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom