iDreamPost
android-app
ios-app

పచ్చని సంసారంలో రేగిన చిచ్చు! భార్యపై అనుమానంతో..!

  • Published Oct 05, 2023 | 11:23 AM Updated Updated Oct 05, 2023 | 11:23 AM
  • Published Oct 05, 2023 | 11:23 AMUpdated Oct 05, 2023 | 11:23 AM
పచ్చని సంసారంలో రేగిన చిచ్చు! భార్యపై అనుమానంతో..!

భార్యాభర్తల సంసారంలో గొడవలు, మనస్పర్థలు రావడం సర్వ సాధారణం. రాత్రి తిట్టుకుని తెల్లారేసరికి మళ్లీ ఇద్దరు కలిసి పోతుంటారు. కానీ, కొందరు దంపతులు మాత్రం.. ప్రతీ చిన్న విషయానికి గొడవ పడుతూ, అనుమానంతో గడిపేస్తుంటారు. అయితే అచ్చం ఇలాగే అనుమానంతో ఓ భర్త భార్యపై దాడికి దిగాడు. ఇంతే కాకుండా మరో దారుణానికి పాల్పడి చివరికి ప్రాణాలతో లేకుండా పోయాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం… గుంటూరు జిల్లాలోని చీరాలలో కే.పాల్ (35)-అర్చన (32) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. కొంత కాలానికి వీరికి ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. అయితే భర్త మంగళగిరిలో కార్పెంటర్ గా పని చేస్తుండగా, భార్య మాత్రం ఓ ఆస్పత్రి క్యాంటిన్ లో పని చేస్తుండేది. అలా వీరి సంసారం సాఫీగానే సాగుతూ వచ్చింది. కాగా, ఈ క్రమంలోనే.. భర్త పాల్ భార్యపై అనుమానంతో వేధించడం మొదలు పెట్టాడు. లేనిపోని సంబంధాలు అంటకట్టి ఆమెను వేధిస్తూ ఉండేవాడు.

ఇదే విషయం భార్యాభర్తలు తరుచు గొడవ పడేవారు. ఇక బుధవారం సాయంత్రం కూడా ఈ దంపతులు మరోసారి గొడవ పడ్డారు. క్షణికావేశంలో ఊగిపోయిన భర్త పాల్.. భార్యను దారుణంగా కొట్టి హత్య చేశాడు. భార్య చనిపోయిందని తెలుసుకుని కుటుంబ సభ్యులకు, బంధువులకు ఫోన్ చేసి.. అర్చనను హత్య చేశానని, నేను కూడా చనిపోతున్నానని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకుని ఇరువురి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు.

అనంతరం ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఇద్దరి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అనుమానం పెనుభూతమై భార్యను హత్య చేసి, చివరికి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డ భర్త దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomgrandpashabetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişkingroyalgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom