ప్రజా ప్రతినిధులు అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజల కష్టనష్టాలను వారివిగా భావించి తీరుస్తూ ఉండాలి. నమ్మి ఓటేసిన వారికి ఎప్పుడూ చేదోడువాదోడుగా ఉండాలి. అయితే అందుకు భిన్నంగా ఉండేవాళ్లు కూడా లేకపోలేదు. కానీ, ఈ ఎమ్మెల్యే మాత్రం మొదటి కేటగిరీ వ్యక్త నిరూపించుకున్నారు. ప్రజల తరఫున మాట్లాడటం మాత్రమే కాదు.. అధికారి గల్లా పట్టుకుని చెంప చెళ్లుమణిపించింది. ఆ మహిళా ఎమ్మెల్యే చేసిన పని చట్టపరంగా తప్పే అయినా.. ప్రజలు మాత్రం ఆమెకు జేజేలు కొడుతున్నారు.
ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. మీరా భయాందర్ నియోజకవర్గంలో మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలు అంటూ కూల్చివేత చేపట్టారు. నగరాల్లో స్థలాలు ఆక్రమించుకుని ఇల్లు కట్టడం వాటిని.. అధికారులు కూల్చేయడం సర్వ సాధారణం. అయితే అందుకు ఒక ప్రక్రియ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా అధికారులు కొన్ని కట్టడాలను కూల్చేయడం ప్రారంభించారు. స్థానికులకు అధికారులు చిన్న వాగ్వాదం కూడా జరిగింది. అయితే స్థానికులు వెంటనే ఎమ్మెల్యే గీతా జైన్ కు ఫిర్యాదు చేశారు.
మేడమ్ వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని అధికారులతో మాట్లాడారు. తమకు అసలు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కట్టడాలు కూలుస్తున్నారంటూ ఆరోపించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే సివిల్ ఇంజినీర్ ను ప్రశ్నించారు. అయితే వారి నుంచి సరైన సమాధానం రాకపోవడం, వారి సమాధానంతో సంతృప్తి చెందకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయారు. వెంటనే ఆ సివిల్ ఇంజినీర్ గల్లా పట్టుకుని నిలదీయడమే కాకుండా.. లాగి లెంపకాయ కొట్టారు. ఈ మొత్తం విషయాన్ని ఫోన్ లో రికార్డు చేసిన వాళ్లు సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వీడియో కాస్తా వైరల్ గా మారింది.
ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చడం తప్పు.. ఎమ్మెల్యే సరైన పనే చేశారు అంటూ కొందరు అంటున్నారు. మరికొందరు అసలు ఒక అధికారిని నడిరోడ్డుపై ఒక ఎమ్మెల్యే ఎలా కొడుతుంది? ఆమెపై యాక్షన్ తీసుకోవాలి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే ఇంజినీర్, అధికారుల తప్పు ఉంటే విచారణ జరిపించి యాక్షన్ తీసుకోవాలి.. అందరి ముందు చేయి చేసుకోవడం తప్పు అంటూ హితవు పలుకుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
आमदार गीता जैन ताई ही कुठली पद्धत आहे अधिकाऱ्यावर हात उचलून प्रश्न सोडवण्याची.अधिकारी चुकला असेल तर सरकार मधे आहात कायदेशीर कार्यवाही करा कायदा हातात घेण्याचा अधिकार तुम्हाला कोणी दिला आहे ? @CMOMaharashtra यांच्यावर कार्यवाही करणार की आमदारांना कायदा हातात घेण्याची सूट आहे ? pic.twitter.com/ndJGyhLVyR
— Suraj Chavan (सूरज चव्हाण) (@surajvchavan) June 20, 2023