Swetha
చదువుకోవాలనే కోరిక, ఆసక్తి ఉంటే పేదరికం అడ్డు రాదనీ ఓ యువతి నిరూపించింది. ఆమె ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబంలో ఉన్నా కూడా.. న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చేసేందుకు.. అమెరికాలోని రెండు యూనివర్సిటీస్ కు సెలెక్ట్ అయింది.
చదువుకోవాలనే కోరిక, ఆసక్తి ఉంటే పేదరికం అడ్డు రాదనీ ఓ యువతి నిరూపించింది. ఆమె ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబంలో ఉన్నా కూడా.. న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చేసేందుకు.. అమెరికాలోని రెండు యూనివర్సిటీస్ కు సెలెక్ట్ అయింది.
Swetha
ప్రపంచంలో ఎంతో మంది ఎదో సాధించాలని ఆరాట పడుతూ ఉంటారు. కానీ, వారిలో కొంతమందికి ఆర్థిక స్థోమత సరిగా లేక అనుకున్నది సాధించేలేక.. అక్కడే ఆగిపోతుంటారు. ఇలా మన చుట్టూ ఎంతో మంది విద్యార్థులు తమ కలలను నెరవేర్చుకోలేక.. కారణాలతోనే కాలం గడిపేస్తారు. మరి కొంతమందికి అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా.. చదువుపై ఆశక్తి చూపరు. ఇలా రెండు రకాల విద్యార్థులను మనం ఇప్పటివరకు చూసే ఉంటాం. అలానే అన్ని అవాంతరాలను ఎదుర్కొని కష్టపడి చదివి పైకి వచ్చిన ఎంతో మందిని కూడా మనం చూశాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ యువతి కూడా ఈ కోవకు చెందిందే. చదువుకోవాలనే ఆశ ఉండాలే .. ఎన్ని అవాంతరాలనైనా ఎదురించవచ్చని నిరూపించింది ఈ యువతి.
దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఈ సుప్రీం కోర్టులో వంటమనిషిగా ఉంటున్న.. ఆమె కూతురుకు చదువుకోవాలనే కోరిక ఉన్నా కూడా.. వారి ఆర్ధిక స్థోమత మాత్రం అందుకు సహరించలేదు. కానీ, వారి కూతురు మాత్రం తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి.. పట్టుదలతో ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ .. తన చదువుని కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఆమె అమెరికాలోని రెండు వేరు వేరు విశ్వ విద్యాలయాలలో.. న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చేసేందుకు ఎంపికైంది. పైగా స్కాలర్ షిప్ ను కూడా సాధించింది. ఆమె పేరే ప్రగ్యా. దీనితో ప్రగ్యా తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. ఈ సంధర్బంగా సీజేఐ జస్టిస్ చంద్రచూడ్.. ప్రగ్యాతో పాటు ఆమె తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు.
నిరుపేద కుటుంబం నుంచి.. నిరంతరం కష్టపడి చదువుతూ.. అమెరికాలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చేసే స్థాయి వరకు ఎదిగిన ప్రగ్యాను.. సన్మానిస్తూ.. కొనియాడారు భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్. అక్కడున్న వారంతా కూడా ప్రగ్యా విషయంలో వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు. అలాగే ఉన్నత చదువులకు కష్టపడి ముందుకు వెళ్ళాలి అనుకుంటే.. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనీ.. ఆయన సూచించారు. ఏదేమైనా ఎంతో మంది పేద విద్యార్థులకు ప్రగ్యా సాధించిన విజయం ఒక ఉదాహరణగా నిలిచింది. కలలు కంటే సరిపోదని.. అనుకున్న కలలను సాకారం చేసుకోవాలంటే.. అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రగ్యా నిరూపించింది. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
VIDEO | Chief Justice of India DY Chandrachud felicitates Pragya, who is daughter of a cook in the Supreme Court. She recently got a scholarship to study masters in law in two different universities in the US.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/0S8RVMOxjN
— Press Trust of India (@PTI_News) March 13, 2024