Swetha
ప్రస్తుతం ఎక్కడ చూసిన ఒకటే మాట ఒకటే బాట.. అందరి దృష్టి అయోధ్యలో కొలువుతీరబోయే ఆ బాల రాముడి మీదే ఉంది. ముఖ్యంగా యూపీలో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలో కొంతమంది తమ చేతిపై టాటూలు వేయించుకుంటూ కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఎక్కడ చూసిన ఒకటే మాట ఒకటే బాట.. అందరి దృష్టి అయోధ్యలో కొలువుతీరబోయే ఆ బాల రాముడి మీదే ఉంది. ముఖ్యంగా యూపీలో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలో కొంతమంది తమ చేతిపై టాటూలు వేయించుకుంటూ కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తున్నారు.
Swetha
ఒక ఆలయ నిర్మాణం కోసం కొన్ని ఏళ్ల పాటు నిరంతర పోరాటం జరగడం, ఆ పోరాటంలో భక్తులు విజయాన్ని సాధించి అనుకున్నట్లుగానే ఆలయాన్ని నిర్మించడం, ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగే రోజు కోసం కొన్ని కోట్ల కళ్ళు ఎదురుచూడడం,ఇవన్నీ బహుశా ఈ యుగంలో ఇదేనేమో జరగడం. రామ జన్మ భూమిలో బాల రాముని ప్రతిష్ట కోసం జరిగిన పోరాటం.. ఖచ్చితంగా రాబోయే తరాలకు ఓ గొప్ప నిదర్శనంగా నిలుస్తోందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ క్రమంలో.. ఇప్పటికే దేశమంతటా అయోధ్య రామయ్య ప్రతిష్ఠా వైభోగ కళ కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రజలు ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో కొంతమంది ప్రజలు తమ చేతులపై “జై శ్రీరామ్” అని టాటూలు కూడా వేయించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆనాడు రాముడు తన గుండెల్లో ఉన్నాడు అంటూ.. గుండెను చీల్చి చూపించి తన ప్రేమను కనబరిచాడు హనుమంతుడు. ఇప్పటికి ఆ రామయ్యను అంతే భక్తిగా కొలిచే ఎంతో మంది భక్తులు ఉన్నారు. ఈ తరంలో కూడా ప్రజలు శ్రీరామునిపై ఉన్న ప్రేమను రకరకాలుగా కనబరుస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఇలాంటి ఎన్నో వార్తలను నిత్యం చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రజలు తమకున్న ప్రేమను కనబరిచే క్రమంలో.. తమ చేతిపై రాముని పేరును చెక్కించుకుంటున్నారు. ఇప్పుడున్న కాలంలో చాలా మంది యువత టాటూలు వేయించుకోవడం అనేది కామన్ అయిపోయింది. తమకు ఇష్టమైన వారి పేరును, లేదా తమకి నచ్చిన వారి జ్ఞాపకాల కోసం.. ఇలా రకరకాలుగా టాటూలు వేయిచుకుంటున్నారు. కానీ, ఉత్తర్ ప్రదేశ్ లోని కొంతమంది ప్రజలు మాత్రం అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా.. ఆ రామునిపై తమకున్న అపారమైన ప్రేమను.. వారి చేతిపై “జై శ్రీరామ్” అని టాటూలు వేయించుకుంటూ కనబరుస్తున్నారు. ఇప్పుడు “జై శ్రీరామ్” అనే పేరుతో ఉన్న టాటూలకు క్రేజ్ బాగా పెరిగింది. ఒకరిని చూసి ఒకరు వరుసగా ఆ రాముని పేరును వారి చేతులపైన టాటూలుగా వేయించుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సామజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇలా రకరకాలుగా వివిధ ప్రాంతాలలో అయోధ్య రామయ్య ప్రతిష్ఠా మహోత్సవ వేడుకులు జరుపుకుంటున్నారు. ఇప్పటికే అయోధ్యలో ప్రతిష్టకు సంబంధించి అన్ని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ మహోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఏదేమైనా, ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు రామయ్య కరుణా కటాక్షాలను పొందడానికి భక్తితో చేసే ప్రయత్నాలు.. చూడముచ్చటగా అనిపిస్తున్నాయని చెప్పి తీరాలి. మరి, యూపీలో “జై శ్రీరామ్” అని కొంతమంది వేయించుకుంటున్న టాటూలపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.