iDreamPost
android-app
ios-app

కేరళలో కొత్త డేంజర్! మెదడుని తినేస్తున్న అమీబా! నలుగురు మృతి!

  • Published Jul 08, 2024 | 1:51 PM Updated Updated Jul 08, 2024 | 1:51 PM

Brain eating amoeba: తాజాగా దేశంలో మరో కొత్త వ్యాధి చాప కింద నీరులా వ్యాపిస్తూ.. మనుషుల ప్రాణాన్ని నెమ్మదిగా తీసేస్తుంది. అయితే స్లో పాయిజన్ గా వచ్చిన ఈ డేంజర్ వ్యాధి పేరు బ్రెయిన్ ఈటింగ్ అమీబా. ప్రస్తుతం ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా వ్యాధి దేశంలో అందరినీ గడగడలాడిస్తుంది. మరి, ఇంతకి ఈ వ్యాధి ఎలా సోకుంతుంది? ఇది ఎంత డేంజర్..? ఈ వ్యాధి సోకిన వారు ఎన్ని రోజుల్లో చనిపోతున్నారు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Brain eating amoeba: తాజాగా దేశంలో మరో కొత్త వ్యాధి చాప కింద నీరులా వ్యాపిస్తూ.. మనుషుల ప్రాణాన్ని నెమ్మదిగా తీసేస్తుంది. అయితే స్లో పాయిజన్ గా వచ్చిన ఈ డేంజర్ వ్యాధి పేరు బ్రెయిన్ ఈటింగ్ అమీబా. ప్రస్తుతం ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా వ్యాధి దేశంలో అందరినీ గడగడలాడిస్తుంది. మరి, ఇంతకి ఈ వ్యాధి ఎలా సోకుంతుంది? ఇది ఎంత డేంజర్..? ఈ వ్యాధి సోకిన వారు ఎన్ని రోజుల్లో చనిపోతున్నారు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Jul 08, 2024 | 1:51 PMUpdated Jul 08, 2024 | 1:51 PM
కేరళలో కొత్త  డేంజర్!  మెదడుని తినేస్తున్న అమీబా! నలుగురు మృతి!

మొన్న మొన్నటి వరకు కరోనా మహామ్మరి విజృంభణతో యావత్తు ప్రపంచం అల్లకల్లోలం అయిపోయిన విషయం తెలిసిందే. ఎంతోమంది ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పటికే ఈ వ్యాధి గురించి తలుచుకుంటేనే.. అందరికీ గుండెల్లో వణుకుపుడుతుది. అలాంటి తాజాగా దేశంలో మరో కొత్త వ్యాధి చాప కింద నీరులా వ్యాపిస్తూ.. మనుషుల ప్రాణాన్ని నెమ్మదిగా తీసేస్తుంది. అయితే స్లో పాయిజన్ గా వచ్చిన ఈ డేంజర్ వ్యాధి పేరు బ్రెయిన్ ఈటింగ్ అమీబా. ప్రస్తుతం ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా వ్యాధి దేశంలోనే కాకుండా.. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంది. దీని వలన చాలామంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ వ్యాధిలో మరణించిన వారు ఎక్కువ శాతం 14 ఏళ్ల పిల్లలే ఎక్కువగా ఉండటం ఆశ్చర్యకరమైన విషయం. ఇకపోతే ఈ వ్యాధికి వయసుతో సంబంధమంటూ ఏమీ ఉండదు. ఇప్పుడైనా ఎవరికైనా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. కాగా, ప్రస్తుతం ఈ డిసీజ్ అనేది భారత్ లో తీవ్ర కలకలం రేపుతుంది. ఇంతకి ఈ వ్యాధి ఎలా సోకుంతుంది? ఇది ఎంత డేంజర్..? ఈ వ్యాధి సోకిన వారు ఎన్ని రోజుల్లో చనిపోతున్నారు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ వివరాళ్లోకి వెళ్తే..

బ్రెయిన్ ఈటింగ్ అమిబా.. ఈ వ్యాధి నేగ్లేరియా ఫౌలెరి అనే అమీబా వల్ల వస్తుంది. అయితే ఈ అమీబా నీటి ద్వారా శరీరంలోకి చేరితుంది. ముఖ్యంగా ఈ రకపు వ్యాధి బ్యాక్టిరియా అనేది నీటిలో ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే మొదట ముక్కు నుంచి వ్యాపించిన ఈ అమీబా బ్యాక్టిరీయా ఆ తర్వాత నాాడీ వ్యవస్థపై అనగా.. మెదడుపై దాడి చేస్తుంది. దీంతో కేవలం 14 రోజుల వ్యవధిలోనే ఈ బ్యాక్టిరియా మెదడుని తినేస్తూ ఒక రకమైన వాపుకు కారణమవుతుంది. దీని ఫలితంగా బాధితులు మొదట కోమోలోకి వెళ్లి ఆ తర్వాత మరణిస్తుంటారు. ఇదిలా ఉంటే.. ఎవ్వరికి అంతుచిక్కని ఈ అమీబా వ్యాధి ఇప్పటికే అమెరికాలో విజృంభవిస్తున్నప్పటికి.. తాజాగా భారత్ లోని కేరళలో తీవ్రంగా వణికిస్తోది. ముఖ్యంగా నెల రోజులుగా ఈ అమీబా వ్యాధి కేరళలో టెన్షన్ పెడుతుండటమే కాకుండా.. రోజు రోజుకి దీని బారిన పడిన రోగుల సంఖ్య నాలుగుకు చేరింది. కాగా, ఇప్పటికే ముగ్గురు చిన్నారులు ఈ వ్యాధి బారినపడి మరణించగా..తాజాగా కేరళలోని కోజికోడ్ కు చెందిన 14 ఏళ్ల మృదుల్ అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే మృదుల్ ఒక చిన్నపాటి చెరువులో స్నానానికి దిగిన అనంతరం ఇంటికి వచ్చిన తర్వాత.. అతడికి తీవ్రంగా వాంతులు అవ్వడం, తల బరువుగా అనిపించిందట. ఇక పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ  అతనికి ఈ వ్యాధి సోకిందని,  కాగా, వ్యాధిని అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (పీఏఎం) అని పిలుస్తారని డాక్టర్లు పేర్కొన్నారు.

ఇది ఒక బ్రెయిన్ ఇన్ఫెక్షన్
బ్రెయిన్ ఈటింగ్ అమిబా అనేది ఒక రకమైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వ్యాధి. ఇది బ్రెయిన్ లోకి సోకి దాని తింటుంది. అయితే ఈ బ్రెయిన్ అమీబా వెచ్చని నీటిలో నివసిస్తుంది.ఈ క్రమంలోనే అమీబా శరీరంలోకి వెళ్లాక కేంద్ర నాడీ వ్యవస్థకు ప్రమాదకరంగా మారుతోంది. దాంతో మొదట నెమ్మదిగా మెదడు పనిచేయడం ఆగిపోతుంది. ఇక ఆ తర్వాత ట్రీట్‌మెంట్‌ ఇచ్చినా బాడీ రెస్పాండ్‌ కాదు. చివరిగా మనిషి ప్రాణాలు పోయే స్థితికి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు .

ఈ వ్యాధి స్విమ్మింగ్ పూల్స్‌లో నదులలో

అయితే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం.. కొన్నిసార్లు అమీబా మురికినీళ్లు, చాలా రోజులు నీళ్లు స్టోర్ చేసిన స్విమ్మింగ్ పూల్స్‌లో కూడా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా.. ఈ అమీబా ఎక్కువగా వేడి ఉష్ణోగ్రతలు ఉన్న నీటిలో కూడా ఉంటుంది. ఇకపోతే స్విమ్మింగ్ పూల్స్, నదులు, చెరువుల్లో సరిగా క్లోరినేషన్ చేయక, మురికి నీళ్లుగా ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా సోకుతుంది. ఇక  ఈ వ్యాధి సోకిన రెండు వారాల నుంచి 15 రోజుల తర్వాత దాని లక్షణాలు కనిపించి.. ఆ తర్వాత వెంటనే బాడీ మొత్తం స్ప్రెడ్‌ అవడం.. ప్రాణాల మీదకు రావడం వేగంగా జరిగిపోతూ ఉంటుంది.

అమీబా వ్యాధి లక్షణాలు

  • ఈ అమీబా వ్యాధి శరీరంలోకి వ్యాపించినప్పుడు ముందుగావైరల్‌ మెనింజైటిస్‌తో తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు, మెడ బిగుసుకుపోతుంది.
  • ఆ తర్వాత మెడ చుట్టూ స్పర్శ కోల్పోవడం, మెంటల్ బ్యాలెన్స్ తప్పిపోవడం వంటివి జరుగుతాయి.
  • ఈ క్రమంలోనే  ఐదు నుంచి ఏడు రోజులలోపు రోగి మెదడులో మార్పులు చోటు చేసుకంటాయని డాక్టర్లు చెబుతున్నారు.
  • ఇక ఆ తర్వాత కపాలం లోపల ఒత్తిడి, ఫిట్స్‌ కూడా వచ్చే అవకాశాలు ఉంటుదని, కొన్నిసార్లు కోమాలోకి వెళ్లే అవకాశం ఉందట.
  • అలా ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన మొదటి రోజు నుంచి 18 రోజుల్లోపు బాధితులు చనిపోయే ప్రమాదం ఉందంటున్నారు.

అందువలన ఈ వ్యాధి కోసం  ఇప్పటికే  విదేశాల నుంచి మందులు తెప్పించి చికిత్స చేస్తున్నారు. అయితే ఎక్కువ శాతం ఈ అమీబా వ్యాధి కేరళలో కనిపిస్తుండటంతో.. కేరళ సీఎం పినరయి విజయన్‌ ఉన్నతస్థాయి వైద్యాధికారులతో చర్చించి అలర్ట్ ప్రకటించారు. పైగా పరిశుభ్రమైన నీటిలో స్నానాలు చేయొద్దని, పిల్లలు ఈత కొట్టకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఎందుకంటే.. ఈ యాంటీ మైక్రోబియల్‌ చికిత్స చేసినప్పటికీ మరణాల రేటు ఎక్కువగానే ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. కనుక పిల్లలు కానీ, పెద్దలు కానీ,  నదులలో, చెరువుల్లో స్విమ్మింగ్ ఫూల్ లో ఈతకొట్టినప్పుడు జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే ఈ వ్యాధి సోకి బ్రెయిన్ సెల్స్‌ను దెబ్బతీసి డేంజర్‌గా మారుతుందని డాక్టర్లు హెచ్చరించారు.