iDreamPost
android-app
ios-app

వైరల్‌ వీడియో: టంగ్‌ స్లిప్‌ అయిన బీబీసీ యాంకర్‌

వైరల్‌ వీడియో: టంగ్‌ స్లిప్‌ అయిన బీబీసీ యాంకర్‌

సోషల్‌ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ప్రపంచం ఈ మూల నుంచి ఆ మూల వరకు ఎప్పుడు ఏం జరుగుతోందో ఇట్టే తెలిసిపోతోంది. ఒకప్పుడు వార్తలు చేరవేయటానికి వేగవంతమైన నెట్‌వర్క్‌గా బీబీసీ ఉండేది. ఇప్పుడు సోషల్‌ మీడియా ఆ స్థానాన్ని ఆక్రమించింది. కొన్ని విషయాలు బీబీసీ కంటే ముందుగానే సోషల్‌ మీడియాలోకి వస్తున్నాయి. అంతేకాదు! బీబీసీకి సంబంధించిన న్యూస్‌లు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

తాజాగా, బీబీసీ యాంకర్‌ లైవ్‌లో నోరు జారిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ యాంకర్‌ కార్యక్రమం ప్రారంభానికి ముందు నోరు జారటం జనాలకు నవ్వు తెప్పిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.. గెరత్‌ బార్‌లోకి బీబీసీ యాంకర్‌గా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఆయన బీబీసీకి సంబంధించిన పలు కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా ఏదైనా కార్యక్రమం ప్రారంభానికి ముందు ‘ మీరు చూస్తున్నది పలానా ఛానల్‌’ అని అంటారు.

గెరత్‌ బార్‌లో కూడా తన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ‘మీరు చూస్తున్నది బీబీసీ న్యూస్‌’ అనడానికి బదులు ‘ నేను చూస్తున్నది బీబీసీ న్యూస్‌’ అని అన్నాడు. ఆ వెంటనే తన తప్పును తెలుసుకుని.. ‘ నేను గెరత్‌ బార్లో.. మీరు చూస్తున్నది బీబీసీ న్యూస్‌’అని అన్నాడు. ఈ వీడియో సోషల్‌ మీడియలో వైరల్‌గా మారి నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది.  మరి, నెటిజన్లకు నవ్వు తెప్పిస్తున్న బీబీసీ యాంకర్‌ గెరత్‌కు సంబంధించిన ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి