వీడియో: ప్రియురాలితో సీక్రెట్ మీటింగ్.. పట్టుకుని పెళ్లి చేసిన గ్రామస్తులు!

ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడుతున్నారు. చదువును పూర్తిగా పక్కకు పెట్టి ప్రేమా, గీమా అంటూ చెడు తిరుగుళ్లు తిరుగుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ యువకుడు తన ప్రియురాలితో మాట్లాడడానికి ఎవరూ లేని టైమ్ లో ఆ యువతి ఇంటికి వెళ్లాడు. అయితే ఇదంతా గమనించిన కొందరు గ్రామస్తులు ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకు సమచారం అందించారు. ఆ తర్వాత ఆ యువకుడిని పట్టుకుని చివరికి పెళ్లి చేశారు. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

గ్రామస్తుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ బరేలీ పరిధిలోని నస్రత్ గంజ్ ప్రాంతానికి చెందిన యువతిని పక్క ఊరికు చెందిన ఓ యువకుడు చాలా కాలంగా ప్రేమిస్తున్నాడు. ఆ యువతి కూడా ఇతడిని ప్రేమిస్తుంది. అలా వీరిద్దరూ గత కొంత కాలం నుంచి పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు. అయితే ఈ యువకుడు తన ప్రియురాలిని సీక్రెట్ గా కలుసుకునేందుకు ఇటీవల ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉండడం కొందరు గ్రామస్తులు గమనించారు.

వెంటనే ఆ యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆ అబ్బాయిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ తర్వాత యువతి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అతడిని ఊరంతా తిప్పుతు చితక్కొట్టారు. అనంతరం యువతి ఇష్టం మేరకు గ్రామంలోని ఓ గుడి వద్ద ఆ ప్రేమికులకు పెళ్లి చేశారు. ఇదంతా కొందరు గ్రామస్తులు వీడియో తీసుకున్నారు. అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.

Show comments