iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ పేరిట లక్షల్లో మోసం! అసలు నిజాలు చెప్పిన ఆదిరెడ్డి

  • Published Aug 02, 2024 | 10:38 PM Updated Updated Aug 02, 2024 | 10:38 PM

Adi Reddy Explained How Fraudsters Cheat On Bigg Boss Name: బిగ్ బాస్ రివ్యూవర్ ఆదిరెడ్డి 8వ సీజన్ కి సంబంధించి అప్ డేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అందులో భాగంగా బిగ్ బాస్ పేరిట జరిగే మోసాలకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. బిగ్ బాస్ ఛాన్స్ కోసం మోస పోకండి అంటూ హితవు పలికాడు.

Adi Reddy Explained How Fraudsters Cheat On Bigg Boss Name: బిగ్ బాస్ రివ్యూవర్ ఆదిరెడ్డి 8వ సీజన్ కి సంబంధించి అప్ డేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అందులో భాగంగా బిగ్ బాస్ పేరిట జరిగే మోసాలకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. బిగ్ బాస్ ఛాన్స్ కోసం మోస పోకండి అంటూ హితవు పలికాడు.

  • Published Aug 02, 2024 | 10:38 PMUpdated Aug 02, 2024 | 10:38 PM
బిగ్ బాస్ పేరిట లక్షల్లో మోసం! అసలు నిజాలు చెప్పిన ఆదిరెడ్డి

బిగ్ బాస్.. బిగ్ బాస్.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రియాలిటీ షోనే ట్రెండింగ్ అవుతోంది. తాజాగా ఈ షోకి సంబంధించి ప్రోమో కూడా రిలీజ్ చేశారు. అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం అంటూ అనౌన్స్ చేశారు. ఈసారి కూడా దాదాపుగా సెప్టెంబర్ నెలలోనే వస్తుంది అనే విషయం అయితే అర్థమవుతోంది. ప్రస్తుతానికి సెట్ వర్క్, కంటెస్టెంట్స్ సెలక్షన్ విషయంలో నిర్వాహకులు బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రతి బిగ్ బాస్ సీజన్ అప్పుడు కూడా కొన్ని పేర్లు వైరల్ అవుతూ ఉంటాయి. ఫలానా వాళ్లు వెళ్లబోతున్నారు అని. అలాగే ఈసారి కూడా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. అయితే బిగ్ బాస్ మూడ్ రాగానే.. కొన్ని మోసాలు కూడా వెలుగు చూస్తూ ఉంటాయి. హౌస్ లోకి పంపిస్తామంటూ కొందరు మోసం చేస్తూ ఉంటారు. ఇదే విషయంపై బిగ్ బాస్ కంటెస్టెంట్, రివ్యూవర్ ఆదిరెడ్డి హెచ్చరించాడు.

ఒక బిగ్ బాస్ రివ్యూవర్ గా తన కెరీర్ ప్రారంభించి.. అదే బిగ్ బాస్ షోకి వెళ్లి తన సత్తా చాటాడు ఆదిరెడ్డి. వచ్చిన తర్వాత కూడా తన రివ్యూవర్ రోల్ ని సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కి సంబంధించి వరుస వీడియోలు, అనాల్సిస్ తో తన ఫాలోవర్స్ ని అలరించాడు. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 వీడియోలు కూడా మొదలు పెట్టాడు. అందులో భాగంగా ఆదిరెడ్డి కొన్ని కీలక విషయాలను ఒక వీడియోగా చేసి పోస్ట్ చేశాడు. ఆ వీడియో బిగ్ బాస్ కి సంబంధించి కొన్ని కీలక విషయాలను చెప్పడమే కాకుండా.. బిగ్ బాస్ పేరిట జరిగే మోసాల గురించి కూడా చెప్పుకొచ్చాడు. ఎవరూ కూడా అలాంటి ట్రాప్ లో పడద్దు అంటూ సూచించాడు.

ఆదిరెడ్డి.. తనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పటి నుంచి హౌస్ కి వెళ్లే వరకు జరిగిన మొత్తం విషయాలను, సెలక్షన్ ప్రాసెస్, రెమ్యూనరేషన్ గురించి మొత్తం చెప్పుకొచ్చాడు. తనకు బిగ్ బాస్ సీజన్ ద్వారా రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు అందినట్లు చెప్పాడు. అలాగే తనకు ఫోన్ చేసి ఏం చెప్పారు? ఆఫర్ ఎలా వచ్చింది అనే విషయాలను కూడా పంచుకున్నాడు. తనకు బిగ్ బాస్ కి సంబంధించిన ఒక వ్యక్తి ఫోన్ చేసి.. మీకు బిగ్ బాస్ కి రావడానికి ఆసక్తి ఉందా అని అడిగారంట. తనకు ఇంట్రస్ట్ ఉంది అని చెప్పిన తర్వాత అధికారిక వెబ్ సైట్ నుంచి మెయిల్ పంపి కొన్ని వివరాలు తెలిపారు.

ఆ తర్వాత అతనికి జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూ జరిగిన విషయాన్ని చెప్పాడు. తర్వాత రెమ్యూనరేషన్ వివరాలు చర్చించడం, హెల్చ్ చెకప్స్, తర్వాత మెయిన్ ఇంటర్వ్యూ కూడా జరిగిందంట. ఏవీలు, డ్యాన్స్ షూట్స్ అన్నీ అయిన తర్వాత హౌస్ లోకి పంపుతారు. అలాగే రికమెండేషన్ తో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం అసాధ్యం అనే విషయాన్ని స్పష్టం చేశాడు. అలాగే ఎవరైనా మీకు బిగ్ బాస్ హౌస్ కి పంపుతాను అని డబ్బులు అడిగినా కూడా ఆ ట్రాప్ లో పడకండి అని సూచించాడు. ఆఫర్ ఇచ్చే పనైతే వాళ్లే కాల్ చేసి.. అధికారిక మెయిల్ ఐడీ నుంచి మెయిల్ చేస్తారని చెప్పుకొచ్చాడు.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomcasinomilyonşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişkingroyalgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom