Uppula Naresh
Uppula Naresh
సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తుంటే మానవత్వం పూర్తిగా చచ్చిపోయిందని కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ, కొన్ని సందర్భాల్లో మాత్రం కొంతమంది మనుషులు మానవత్వాన్ని చాటుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటుంటారు. అయితే అచ్చం ఇలాగే తాజాగా ఓ యుడకుడు మానవత్వం ఇంకా బతికే ఉందని నిజం చేసి చూపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?
ఓ యువకుడు అందరిలాగే తన పని మీద రోడ్డుపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో ప్లాస్టిక్ డబ్బాలో ఓ కుక్కు మూతి ఇరక్కుని కనిపించింది. దీంతో ఆ తల బయటకు తీసేందుకు ఆ కుక్క ఎంతో ప్రయత్నించి విఫలమైంది. ఇక చేసేందేం లేక రోడ్డుపై పరుగెత్తు కుంటూ వెళ్తుంది. ఇదంతా ఆ యువకుడు గమనించాడు. ఎలాగైనా ఆ కుక్కను పట్టుకుని ఆ ప్లాస్టిక్ డబ్బాను తొలగించాలని అనుకున్నాడు. దీంతో వెంటనే ఆ కుక్కను పట్టుకోవడానికి ఆ యువకుడు రోడ్డుపై పరుగులు తీశాడు.
అతి కష్టంగా మొత్తానికి ఆ కుక్కను పట్టుకున్నాడు. ఆ కుక్క మాత్రం అతడిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా.. అస్సలు వదలకుండా వాహనదారుల సాయంతో ఆ ప్లాస్టిక్ డబ్బాను తొలగించి ఆ కుక్కను రక్షించాడు. ఇదంతా కొందరు వాహనదారులు వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన చాలా మంది ఆ యువకుడు చేసిన పనికి సెల్యూట్ చేస్తున్నారు. మానవత్వం ఇంకా బతికే ఉందనడానికి ఇదే ఉదాహరణ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే మాత్రం తెలియరాలేదు.