VIDEO:టికెట్ లేకుండా వందే భారత్ ఎక్కిన పోలీస్! ఊహించని షాకిచ్చిన TTE!

కేంద్ర ప్రభుత్వం దేశంలోని కొన్నిప్రాంతాల్లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించింది. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇందులో ప్రయాణిస్తూ తక్కువ సమయంలోనే వీరి గమ్యాలకు చేరుకుంటున్నారు. దీంతో రోజు రోజుకు ఇందులో ప్రయాణికుల తాకిడి కూడా ఎక్కువవుతోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ పోలీస్ ఆఫీసర్ టికెట్ లేకుండా వందే భారత్ రైలు ఎక్కాడు. ఇక కొద్దిసేపటి తర్వాత టీటీఈ వచ్చి టికెట్ ఏదని ప్రశ్నించాడు. దీంతో సమాధానం చెప్పలేక ఆ పోలీస్ నోట్లో నీళ్లు నమిలాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

మన దేశంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు అందుబాటులోకి రావడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు అతి తక్కువ సమయంలోనే వారి గమ్యాలకు చేరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ పోలీస్ ఇన్ స్పెక్టర్ టికెట్ లేకుండా వందే భారత్ రైలు ఎక్కాడు. ఆ పోలీస్ లోలోపల సంతోషపడేలోపే అటు నుంచి టీటీఈ (Traveling Ticket Examiner)వచ్చాడు. టికెట్ చెకింగ్ వచ్చి టికెట్ ఎక్కడ అని ప్రశ్నించారు. దీంతో ఆ పోలీస్ ఆఫీసర్ ఒక్కసారిగా షాక్ గురయ్యాడు.

టికెట్ తీసుకోలేదని, బస్సు మిస్ కావడంతో ఈ రైలు ఎక్కానని చెప్పాడు. టికెట్ లేకుండా ఎందుకు ఎక్కారని టీటీఈ ప్రశ్నించగా పోలీస్ ఆఫీసర్ సమాధానం చెప్పలేక నోట్లో నీళ్లు నమిలాడు. ఇక తర్వాత స్టేషన్ లో రైలు ఆగాక టీటీఈ ఆ పోలీస్ ఆఫీసర్ ను రైలు నుంచి కిందకు దించినట్లు తెలుస్తుంది. ఈ ఘటన లక్నోలోని వందే భారత్ రైలులో జరిగినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియలో కాస్త వైరల్ గా మారుతోంది.

Show comments