iDreamPost
android-app
ios-app

వీడియో: బాలుడిపై దాడి చేసిన 6 వీధి కుక్కలు

  • Published Aug 14, 2023 | 3:31 PM Updated Updated Aug 14, 2023 | 3:31 PM
  • Published Aug 14, 2023 | 3:31 PMUpdated Aug 14, 2023 | 3:31 PM
వీడియో: బాలుడిపై దాడి చేసిన 6 వీధి కుక్కలు

దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలపై దాడులు చేస్తూ చివరికి అమాయకపు పిల్లల ప్రాణాలు తీస్తున్నాయి. ఇటీవల కుక్కల దాడిలో చాలా మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ వరుస ఘటనలు మరువక ముందే తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఓ బాలుడు వీధిలో నిలబడి ఉండగా ఒకేసారి 6 కుక్కలు దాడి చేశాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ ప్రాంతంలో విరాజ్ గుప్తా (7) అనే బాలుడు చాక్లెట్ కోనేందుకు పక్కనే ఉన్న షాప్ కు వెళ్లాలని అనుకున్నాడు. ఇతడి రాకను గమనించిన వీధి కుక్కలు ఆ బాలుడిపై దాడి చేశాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 6 కుక్కలు ఒకేసారి విరాజ్ గుప్తా మీద పడి దాడికి దిగాయి. భయంత ఆ బాలుడు అరుస్తు కేకలు వేశాడు. దీంతో స్థానికులు అప్రమత్తమై ఆ కుక్కలను తరిమికొట్టి బాలుడిని రక్షించారు. అనంతరం విరాజ్ గుప్తా తల్లి కుమారుడిని దగ్గరకు తీసుకుని పరీక్షించింది.

ఆ తర్వాత ఈ కుక్కల దాడిలో గాయపడ్డ కుమారుడిని తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆ బాలుడిని వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. బాలుడిపై ఒకేసారి 6 వీధి కుక్కలు దాడి చేసిన ఈ ఘటనపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: వీడియో: బాలికపై ఆవు దాడి.. కొమ్ములతో కుమ్ముతూ..

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom