iDreamPost
android-app
ios-app

వీడియో: బాలికపై ఆవు దాడి.. కొమ్ములతో కుమ్ముతూ..

  • Published Aug 10, 2023 | 1:25 PM Updated Updated Aug 10, 2023 | 5:31 PM
  • Published Aug 10, 2023 | 1:25 PMUpdated Aug 10, 2023 | 5:31 PM
వీడియో: బాలికపై ఆవు దాడి.. కొమ్ములతో కుమ్ముతూ..

తమిళనాడులోని చెన్నైలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఆవు కాలేజీకి వెళుతున్న ఓ విద్యార్థినిపై దాడికి పాల్పడింది. రోడ్డుపై వెళుతున్న ఆమెను కొమ్ములతో ఎత్తి కిందపడేసి.. విచక్షణా రహితంగా కుమ్మింది. ఆవు దాడిలో గాయపడ్డ యువతి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని, చెన్నై, అరుంబాకమ్‌కు చెందిన ఓ బాలిక తన తల్లి, సోదరుడితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ స్కూలుకు వెళుతూ ఉంది. ముగ్గరు ఇలంగో నగర్‌లోని ఓ చిన్న సందులోకి వచ్చారు.

అక్కడ ఓ ఆవు తన పిల్లతో రోడ్డుపై నిలబడి ఉంది. దీంతో బాలిక ఓ వైపునకు జరిగి నడుచుకుంటూ వెళ్లటానికి ప్రయత్నించింది. అయితే, ఆ అవుకు ఏమైందో ఏమో తెలీదు కానీ, బాలికపై రెచ్చిపోయింది. కొమ్ములతో పైకి ఎత్తి కిందపడేసింది. తర్వాత నేలపై అదిమిపట్టి కొమ్ములతో కుమ్మసాగింది. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ పరిణామంతో తల్లి, సోదరుడు భయాందోళనకు గురయ్యారు. ఆవు తన పాటిన తాను బాలికపై దాడి చేస్తూనే ఉంది. తల్లి తన కూతుర్ని కాపాడుకోవటానికి చాలా ప్రయత్నించింది.

రాళ్లతో కొట్టసాగింది. గట్టిగా అరవసాగింది. అయినా ఆ ఆవు పక్కకు కదల్లేదు. అక్కడ ఉన్న కొద్ది మంది జనం ఆవును పక్కకు తోలే ప్రయత్నం కూడా చేయలేదు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి మరికొంత మంది వచ్చారు. ఆ ఆవును రాళ్లతో కొట్టి పక్కకు పంపేశారు. ఆ వెంటనే గాయపడ్డ బాలికను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. బాలికకు ప్రస్తుతం అత్యవసర విభాగంలో చికిత్స అందుతోంది. ఆవు బాలికపై దాడికి పాల్పడ్డ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetmeritbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom