iDreamPost
android-app
ios-app

జానీ మాస్టర్‌ ఇష్యూ.. కమిటీ ఏర్పాటు చేసిన TFCC.. కమిటీలో ఎవరెవరు ఉన్నారంటే?

  • Published Sep 17, 2024 | 4:27 PM Updated Updated Sep 17, 2024 | 4:27 PM

TFCC: లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. జానీ వివాదంపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ స్పందించారు.

TFCC: లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. జానీ వివాదంపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ స్పందించారు.

జానీ మాస్టర్‌ ఇష్యూ.. కమిటీ ఏర్పాటు చేసిన TFCC.. కమిటీలో ఎవరెవరు ఉన్నారంటే?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం టాలీవుడ్లో ప్రస్తుతం సంచలనంగా మారింది. లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీపై కేసు నమోదైన విషయం అందరికి తెలిసిందే. తాజాగా జానీ వివాదంపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ స్పందించారు. ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు 2018 నుంచి లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు. లైంగిక వేధింపులకు గురైన లేడీ కొరియోగ్రాఫర్ నుండి వచ్చిన ఫిర్యాదును ప్యానల్ స్వీకరించినట్లు చెప్పారు.

తెలుగు ఫిల్మ్ అండ్‌ టీవీ డ్యాన్సర్స్ అండ్‌ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్‌ మీద వచ్చిన ఫిర్యాదును పరిష్కరించడానికి కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఆ మహిళా కొరియోగ్రాఫర్ చేసిన ఫిర్యాదు ప్రస్తుతం విచారణ దశలో ఉన్నట్లు చెప్పారు. అందువల్ల విచారణ పూర్తి అయ్యే దాకా ఆ మగ కొరియోగ్రాఫర్‌ను యూనియన్‌లో ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించాలని ఇప్పటికే ఫెడరేషన్‌ను కోరినట్లు దామోదర్ ప్రసాద్ తెలిపారు. ఇలాంటి లైంగిక వేధింపుల ఫిర్యాదుల కోసం మహిళలు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను సంప్రదించవచ్చని అన్నారు.

TFCC

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీసు బయట ఫిర్యాదు పెట్టె ఉంచినట్లు చెప్పారు. ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల సమయంలో ఎప్పుడైనా కాని ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు. అలాగే వాట్సాప్ నెంబర్ 9849972280, complaints@telugufilmchamber.in మొయిల్‌ కి కూడా ఫిర్యాదు పంపవచ్చని చెప్పారు. లేదంటే.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, డా. డి.రామానాయుడు బిల్డింగ్ కాంప్లెక్స్, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, హైదరాబాద్-500 096 అడ్రెస్ కి పోస్ట్ లేదా కొరియర్ ద్వారా ఫిర్యాదులను పంపవచ్చని చెప్పారు. అలాగే బాధితులు పంపిన వారి వివరాలను బయట పెట్టకుండా గోప్యంగా ఉంచుతామని కూడా అన్నారు. ఇక తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్- లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ లో KL దామోదర్ ప్రసాద్ ( Hon సెక్రటరీ & కన్వీనర్), ఝాన్సీ( చైర్‌పర్సన్), తమ్మారెడ్డి భరద్వాజ, సుచిత్రా చంద్రబోస్, వివేక్ కూచిభొట్ల, ప్రగతి మహావాది, రామలక్ష్మి మేడపాటి( సామాజిక కార్యకర్త,మీడియా నిపుణురాలు) కావ్య మండవ (న్యాయవాది, POSH నిపుణురాలు) సభ్యులుగా కొనసాగుతున్నారు. మరి జానీ మాస్టర్‌ ఇష్యూ పై, TFCC ఏర్పాటు చేసిన కమిటీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.