iDreamPost
android-app
ios-app

Sarakaru vari pata సర్కారు మాట నిలబడుతుందా?

  • Published Apr 11, 2022 | 11:59 AM Updated Updated Apr 11, 2022 | 11:59 AM
Sarakaru vari pata సర్కారు మాట నిలబడుతుందా?

2020లో సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మహేష్ బాబుకు ఏకంగా రెండేళ్లకు పైగా గ్యాప్ వచ్చేసింది. కరోనా ప్రధాన కారణం అయినప్పటికీ సర్కారు వారి పాట షూటింగ్ ఆలస్యం కావడం కూడా దీనికి దోహదపడింది. రిలీజ్ డేట్లు పలుమార్లు మారుతూ వచ్చి ఫైనల్ గా మే 12కి ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడైనా ఖచ్చితంగా ఆ తేదీకి వస్తారా అంటే చెప్పలేని పరిస్థితి నెలకొందని ఇన్ సైడ్ టాక్. చేతిలో నెల రోజులు మాత్రమే ఉంది. ఇప్పటిదాకా రెండు లిరికల్ వీడియోలు వచ్చాయి. మూడోది సిద్ధంగా ఉంది. మరో రెండు బాలన్స్ ఉంటాయి. టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ వగైరా గ్రాండ్ స్కేల్ లో చేయాల్సి ఉంటుంది.

ఇంత తక్కువ టైంలో ఇవన్నీ పూర్తి చేయగలరా అంటే అనుమానమే. దానికి తోడు ఆర్ఆర్ఆర్ యాభై రోజుల కోసం కొన్ని మెయిన్ స్క్రీన్లు బ్లాక్ చేసి పెట్టారు. ఏప్రిల్ 29న రాబోతున్న ఆచార్య కనీసం రెండు వారాల అగ్రిమెంట్లతో డిస్టిబ్యూటర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే వాటిని అంత ఈజీగా తగ్గించడం కుదరకపోవచ్చు. కెజిఎఫ్ 2, బీస్ట్ లు అప్పటికి నెల రోజులు పూర్తి చేసుకుని ఉండవు. దానికి తోడు బాలీవుడ్ నుంచి కూడా కొన్ని క్రేజీ సినిమాలు క్యూ కడుతున్నాయి. ఈ సిచువేషన్ లో ఇంత ఒత్తిడి మధ్య సర్కారు వారి పాట డెడ్ లైన్ మీట్ అవ్వడం అంత సులభం కాదు. వేగంగా పరుగులు పెట్టాలి.

టాకీ పార్ట్ చివరి భాగం ప్రస్తుతం కాకినాడ పోర్ట్ లో జరుగుతోంది. ఇది కాగానే ఇంకొక్క పాట చిత్రీకరణ జరపాల్సి ఉంటుంది. దర్శకుడు పరశురామ్ ఒకపక్క ఇవి చూసుకుంటూనే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కానిచ్చేస్తున్నారు. అభిమానులు ప్యాన్ ఇండియా రిలీజ్ డిమాండ్ చేస్తున్న పరిస్థితిలో ఒకవేళ హిందీ వెర్షన్ కూడా వదలాలనుకుంటే అప్పుడు ప్రెజర్ మాములుగా ఉండదు. ఇది భరించలేకే భీమ్లా నాయక్ ట్రైలర్ వచ్చాక హిందీ థియేట్రికల్ రిలీజ్ ని ఆపేసింది. సో సర్కారు వారి పాట మే 12కే కట్టుబడుతుందా లేదా అనేది మరికొద్ది రోజులు ఆగితే క్లారిటీ వచ్చేస్తుంది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో కీర్తి సురేష్ హీరోయిన్