మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాకు సినిమాకు తన ఇమేజ్ను పెంచుకుంటూ పోతున్నారు. మూస ధోరణి చిత్రాలకు దూరంగా ఉంటూ.. కథ, కథనాలకు ఆయన ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ‘రంగస్థలం’, ‘ఆర్ఆర్ఆర్’ మూవీస్ ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ రెండు సినిమాల్లో చరణ్ వైవిధ్యమైన నటనతో అందర్నీ మెస్మరైజ్ చేశారు. డ్యాన్సులు, ఫైట్లు అద్భుతంగా చేస్తారనే పేరున్న చరణ్.. పై రెండు చిత్రాల్లో యాక్టింగ్‌లోనూ తన మార్క్ చూపించారు. ‘రంగస్థలం’లో చెవిటివాడిగా నటించి ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’లో భిన్నమైన ఎమోషన్స్ కలిగిన రామ్ పాత్రను ఆయన పోషించిన తీరు అద్భుతం అనే చెప్పాలి.
‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్ పాపులారిటీ పాన్ ఇండియా లెవల్లో పెరిగింది. ఈ సినిమాకు గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు రావడం విశేషం. ఈ మూవీని యూఎస్, జపాన్ ఆడియెన్స్ బాగా ఆదరించడంతో చరణ్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. అలాంటి చెర్రీ నుంచి తర్వాతి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో ‘గేమ్ ఛేంజర్’ అనే మూవీని చరణ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల పాటు ఈ మూవీ షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంది. అయితే ‘గేమ్ ఛేంజర్’తో పాటు ఏకకాలంలో ‘భారతీయుడు 2’ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు శంకర్. ఈ టైమ్‌లో లైకా ప్రొడక్షన్స్ కొత్త మెలిక పెట్టిందట.
‘భారతీయుడు’ సీక్వెల్‌ను పూర్తి చేయనిదే శంకర్ ఏ సినిమానూ పూర్తి చేయడానికి వీల్లేదంటూ లైకా ప్రొడక్షన్స్ ఆంక్షలు విధించిందట. దీంతో చేసేదేమీ లేక కమల్ హాసన్ మూవీ షూటింగ్ పనుల్లో శంకర్ బిజీ అయిపోయారట. మరోవైపు చెర్రీ కూడా తన వ్యక్తిగత కారణాల వల్ల షూటింగ్‌కు గ్యాప్ ఇస్తూ వస్తున్నారు. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి ‘గేమ్ ఛేంజర్’ను రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రిలీజ్ టైమ్‌కు సినిమా పూర్తయ్యేలా కనిపించడం లేదట. దీంతో చిత్ర నిర్మాత దిల్ రాజు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ‘హిట్’ సిరీస్ ఫేమ్ శైలేష్ కొలనును దిల్ రాజు సీన్లోకి దించారని సమాచారం. ఈ ఫిల్మ్‌లోని కొన్ని యాక్షన్ సీక్వెన్సులను శైలేష్ కొలనుతో షూట్ చేయించాలని దిల్ రాజు డిసైడ్ అయ్యారని టాలీవుడ్ టాక్. దీంట్లో ఎంత నిజం ఉందనేది మూవీ యూనిట్‌కే తెలియాలి.