వెండితెర మీద రాణించడం అంటే అంత ఈజీ కాదు. సినిమాల్లో అవకాశాల కోసం ఆసక్తి ఉన్నవారు చాలా విధాలుగా ప్రయత్నిస్తారు. కొందరు మోడలింగ్ ద్వారా ఈ రంగంలోకి అడుగుపెడితే.. మరికొందరు సోషల్ మీడియాలో ఉన్న పాపులారిటీ ద్వారా ఇక్కడ ఛాన్సులు దక్కించుకుంటారు. ఇంకొందరు నాటకాలు, టెలివిజన్ రంగంలో పేరు తెచ్చుకొని ఇక్కడ అవకాశాలు దక్కించుకుంటారు. అయితే ఎలా వచ్చినా గానీ ప్రతిభకు తోడు అదృష్టం కూడా కలసి వస్తే వెండితెరపై వెలిగిపోవచ్చు. టాలెంట్‌కు లక్ కూడా తోడైతే వాళ్లను ఆపడం ఎవరి తరమూ కాదు.
బుల్లితెరలో స్టార్డమ్ సంపాదించి ఆ తర్వాత వెండితెరకు పరిచయమైన వాళ్లు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు హీరోయిన్ ప్రియా భవానీ శంకర్. టీవీ యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ అనంతరం బుల్లితెరకు, ఆపై వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ మొదట్లో పెద్దగా సక్సెస్‌లు అందుకోని ఈ బ్యూటీ.. ప్రస్తుతం పెద్ద చిత్రాల్లో నటిస్తున్నారు. ఛాన్స్ దొరికినప్పుడుల్లా సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో టచ్ ఉంటారు ప్రియా భవానీ శంకర్. ఇవాళ ప్రపంచ గులాబీ దినోత్సవం సందర్భంగా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె తన తల్లికి క్యాన్సర్ సోకిన విషయం గురించి చెప్పుకొచ్చారు.
‘నా తల్లి కూడా క్యాన్సర్ బాధితురాలే. గత సంవత్సరం ఆమెకు క్యాన్సర్ సోకింది. అప్పుడు అందరూ నన్ను కూడా టెస్ట్ చేయించుకోమన్నారు. మా అమ్మ అనారోగ్యానికి గురైనప్పుడల్లా నీకు త్వరలోనే నయమవుతుందని చెబుతూ ఉంటా. తొలిదశలోనే క్యాన్సర్‌ను గుర్తించి ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. ఇవాళ ఇక్కడ ఇంతమంది వారి అనుభవాలు చెప్పుకునేందుకు రావడం చూస్తే చాలా ఎంకరేజింగ్‌గా ఉంది. మా అమ్మను క్యాన్సర్ బలితీసుకోనివ్వను. తనను కాపాడుకుంటా. డాక్టర్లపై నాకు పూర్తి నమ్మకం ఉంది’ అని చెబుతూ స్టేజీ మీదే ప్రియా భవానీ శంకర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్న క్యాన్సర్ వ్యాధిగ్రస్తులతో మాట్లాడి వారిలో ధైర్యాన్ని నింపారు.
ఇదీ చదవండి: అట్లీ-అల్లు అర్జున్ కాంబో.. ఏదీ తేల్చి చెప్పరేం?