రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వచ్చే సినిమా కోసం ఆయన ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ‘బాహుబలి’ ముందు వరకు టాలీవుడ్‌కే ఆయన ఇమేజ్ పరిమితమైంది. అయితే ‘బాహుబలి’ సిరీస్‌తో ఒక్కసారిగా పాన్ ఇండియా ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు ప్రభాస్. దీంతో డార్లింగ్‌తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఎగబడ్డారు. ఈ క్రమంలో ‘సాహో’తో ఆడియెన్స్ ముందుకొచ్చాడు ప్రభాస్. ఈ సినిమా హిందీలో సక్సెస్ అయినప్పటికీ తెలుగునాట మాత్రం వసూళ్లలో వెనుకపడింది. రెబల్ స్టార్ నుంచి ఆ తర్వాత వచ్చిన ‘రాధేశ్యామ్’ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
ప్రభాస్ నటించిన కొత్త చిత్రం ‘ఆదిపురుష్’ ఇటీవలే బిగ్స్క్రీన్స్లో రిలీజైంది. ఈ మూవీకి ఫ్లాప్ టాక్ వచ్చినా కలెక్షన్లలో మాత్రం దుమ్మురేపింది. ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’ ఫిలింలో యాక్ట్ చేస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఒక టీజర్ రిలీజైంది. ప్రభాస్ క్యారెక్టర్‌కు ఇందులో ఇచ్చిన ఇంట్రడక్షన్, బీజీఎం అదిరిపోయాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది ‘సలార్’. అలాంటి ఈ టీజర్‌పై, ఇందులో యాక్ట్ చేసిన హీరో ప్రభాస్‌పై ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సలార్’ టీజర్ ఒక చెత్త అని వివేక్ అన్నారు.
లౌడ్ సౌండ్‌తో కూడిన నాన్సెన్స్ యాక్షన్‌గా ‘సలార్’ టీజర్ గురించి చెప్పుకొచ్చారు వివేక్ అగ్నిహోత్రి. అంతేకాదు ప్రభాస్ యాక్టింగ్ గురించి కూడా ఆయన కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. ‘సలార్’ టీజర్లో వయొలెన్స్ ఎక్కువగా చూపించారు. ఇదే విషయాన్ని ఆయన ఇన్‌డైరెక్ట్‌గా ప్రస్తావించారు. ఎవరూ కూడా హింసాత్మకంగా పుట్టరని ఆయన తెలిపారు. ప్రస్తుత సినిమాల్లో మితిమీరిన హింసను గ్లామరైజ్ చేస్తున్నారని వివేక్ పేర్కొన్నారు. దీన్ని ప్రమోట్ చేయడమే టాలెంట్‌గా పరిగణిస్తున్నారని ట్వీట్ చేశారు. అసలు యాక్టరే కాని ఒక వ్యక్తిని బిగ్గెస్ట్ స్టార్‌గా ప్రమోట్ చేయడాన్ని అదిపెద్ద టాలెంట్‌గా పరిగణిస్తున్నారని వివేక్ అగ్నిహోత్రి వివరించారు. ప్రేక్షకులకు ఏమీ తెలియదని భావించడమే అతిపెద్ద టాలెంట్ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
Now glamourising extreme violence in cinema is also considered talent. Promoting nonsense cinema is considered a bigger talent. Promoting a non-actor as biggest star is considered biggest talent. And assuming audience is super-dumb is mother of all talent. https://t.co/hTJnLjJGYb
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) July 6, 2023