iDreamPost
android-app
ios-app

మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. గూస్ బంప్స్ తెప్పించేలా కొత్త మూవీ అప్డేట్

  • Author Soma Sekhar Published - 12:00 PM, Tue - 22 August 23
  • Author Soma Sekhar Published - 12:00 PM, Tue - 22 August 23
మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. గూస్ బంప్స్ తెప్పించేలా కొత్త మూవీ అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు వింటే చాలు ఫ్యాన్స్ లో ఓ వైబ్రేషన్ మెుదలౌతుంది. ఇండస్ట్రీలో హిట్ల మీద హిట్లు కొట్టి టాలీవుడ్ నంబర్ 1 హీరోగా నిలబడ్డాడు. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ మెుదలు పెట్టాక.. వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు మెగాస్టార్. కాగా.. ఆగస్టు 22 మంగళవారం నాడు మెగాస్టార్ తన 68వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటులతో పాటుగా.. రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా.. మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఆయన నెక్ట్స్ మూవీ అప్డేట్ ను ఇచ్చారు మేకర్స్. బింబిసార డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ గుస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది.

భోళా శంకర్ మూవీ తీవ్ర నిరాశపరచడంతో.. మెగా ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ బర్త్ డే కానుకగా కిక్కెక్కించే అప్డేట్ ఇచ్చింది యూవీ క్రియేషన్స్. చిరంజీవి నటించే 157వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. భోళా శంకర్ తో నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే పోస్టర్ ను రిలీజ్ చేసింది. బింబిసార మూవీ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తారని గతంలోనే వార్తలు వచ్చాయి. తాజాగా వీరి కాంబినేషన్లో మూవీ వస్తోందని కన్ఫామ్ చేస్తూ.. ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్.

కాగా.. ఈ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పంచ భూతాలను ఇందులో చూపించాడు డైరెక్టర్. దీంతో ఇదేదో మైథలాజికల్ మూవీలా ఉండబోతోంది అని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఇక రెండో సినిమాతోనే మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే రేంజ్ కు ఎదిగాడు వశిష్ఠ. కాగా.. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. మరి మెగాస్టార్ 157 మూవీ పోస్టర్ చూస్తే ఏమనిపించిందో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: మహేశ్ బాబు-సౌందర్య కాంబినేషన్లో మిస్ అయిన మూవీ ఏంటో మీకు తెలుసా?

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetbaba girişgrandpashabet