iDreamPost
android-app
ios-app

LYF: షూటింగ్ పూర్తి చేసుకున్న లైఫ్ (లవ్ యువర్ ఫాదర్).. తండ్రికి కొడుకుకి మధ్య ఉన్న బంధాన్ని తెలిపే మూవీ!

  • Published Sep 24, 2024 | 9:57 PM Updated Updated Sep 24, 2024 | 10:19 PM

LYF: శ్రీ హర్ష, కషిక కపూర్ జంటగా పవన్ కేతరాజు దర్శకుడిగా వస్తున్న సినిమా 'లైఫ్' (లవ్ యువర్ ఫాదర్). ఈ మూవిని మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ ఇంకా ఏ. రామస్వామి రెడ్డి ఈ మూవిని నిర్మించారు.

LYF: శ్రీ హర్ష, కషిక కపూర్ జంటగా పవన్ కేతరాజు దర్శకుడిగా వస్తున్న సినిమా 'లైఫ్' (లవ్ యువర్ ఫాదర్). ఈ మూవిని మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ ఇంకా ఏ. రామస్వామి రెడ్డి ఈ మూవిని నిర్మించారు.

  • Published Sep 24, 2024 | 9:57 PMUpdated Sep 24, 2024 | 10:19 PM
LYF: షూటింగ్ పూర్తి చేసుకున్న లైఫ్ (లవ్ యువర్ ఫాదర్)..  తండ్రికి కొడుకుకి మధ్య ఉన్న బంధాన్ని తెలిపే మూవీ!

శ్రీ హర్ష, కషిక కపూర్ జంటగా పవన్ కేతరాజు దర్శకుడిగా వస్తున్న సినిమా ‘లైఫ్’ (లవ్ యువర్ ఫాదర్). మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ ఇంకా ఏ. రామస్వామి రెడ్డి ఈ మూవిని నిర్మించారు. ఈ మూవీలో ఎస్. పి. చరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్, రియా, సంధ్య ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా షూటింగ్ నేటితో పూర్తయింది. అతి త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఈ మూవీ టీం మీడియాతో ముచ్చటించారు.

దర్శకుడు పవన్ కేతరాజు మాట్లాడుతూ.. “కొడుకు బాధ్యత తీర్చేందుకు తండ్రి పడే ఆరాటం తండ్రి కోసం కొడుకు చేసే పోరాటం మా ఈ లైఫ్ సినిమా. కథ అంతా కాశి బ్యాక్ డ్రాప్ లో జరుగుతూ శివతత్వాన్ని చూపించే చిన్న ప్రయత్నం చేశామన్నారు. ఒక మంచి ఫ్యామిలీ ఎంటరటైనర్ సినిమాగా ఈ సినిమాని తీస్తున్నాం. హీరో శ్రీహర్ష మొదటి సినిమా అయినా చాలా బాగా నటించాడు. హీరో తండ్రి పాత్రలో ఎస్పి చరణ్ గారు ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యారు. రఘు బాబు గారు, షకలక శంకర్, ప్రవీణ్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. శ్యామ్ కె నాయుడు గారు సినిమాటోగ్రఫీ విజువల్ వండర్ లా ఉంటుంది. ఈ సినిమా విజువల్స్ ఇంత గ్రాండ్ గా ఉన్నాయంటే శ్యామ్ గారి వల్లే. అదేవిధంగా మణిశర్మ గారు ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. అన్ని పాటలు చాలా మేలోడి గా ఇచ్చారు. క్లైమాక్స్ మరియు బిజియం కథ కి హైలైట్ . కషిక కపూర్ చాలా బాగా నటించింది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.

హీరో శ్రీహర్ష మాట్లాడుతూ.. “లైఫ్… తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని చూపించే ఒక మంచి సినిమా. ఈరోజు ఈ సినిమా షూటింగ్ లాస్ట్ డే. సినిమా అయితే చాలా బాగా వచ్చింది. కచ్చితంగా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను” అని అన్నారు. తరువాత హీరోయిన్ కషిక కపూర్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ కి ప్రొడ్యూసర్స్ కి కృతజ్ఞతలు. కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ గారు ప్రొడక్షన్ వైస్ చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. డైరెక్టర్ పవన్ చెప్పిన కథ చాలా బాగుంది. తండ్రికి కొడుకు కి మధ్య ఉండే అనుబంధాన్ని చాలా బాగా చూపిస్తున్నారు. ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను” అని అన్నారు.

నిర్మాత అన్నపరెడ్డి రామస్వామి రెడ్డి మాట్లాడుతూ ..”ఆరు నెలల క్రితం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాం. నేటితో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. డైరెక్టర్ పవన్ గారు, సినిమాటోగ్రఫీ శ్యామ్ గారు, మ్యూజిక్ మణిశర్మ గారు చాలా కష్టపడ్డారు. సినిమా ఎక్కువ శాతం కాశీలో షూట్ చేసాం. దైవత్వంతో పాటు తండ్రి కొడుకులు మధ్య ఉన్న బంధాన్ని కూడా చాలా బాగా చూపిస్తున్నాం. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ఇష్టపడి నటించారు. మా మూవీ టీమ్ అందరికీ ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ పూర్తి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. త్వరలో ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది అని నమ్మకంతో ఉన్నాము” అని అన్నారు. ఇక షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలో విడుదల కాబోతున్న లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss