iDreamPost
iDreamPost
నిన్న విడుదలైన కెజిఎఫ్ చాప్టర్ 2 బాక్సాఫీస్ ప్రకంపనలు మాములుగా లేవు. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో వసూళ్లకు ట్రేడ్ పండితుల మతులు పోతున్నాయి. సౌత్ ఇండియాని మినహాయించి కేవలం ఒక్క హిందీ వెర్షన్ నుంచి మొట్టమొదటిసారి 60 కోట్లకు పైగా ఒక్క రోజులోనే వసూలు చేసిన సినిమాగా కెజిఎఫ్ 2 చరిత్ర సృష్టించింది. గతంలో బాహుబలి 2 పేరుమీదున్న 58 కోట్ల బెంచ్ మార్క్ ని ఈజీగా దాటేసి రాఖీ బాయ్ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు. అంత పబ్లిసిటీ చేసిన ఆర్ఆర్ఆర్ కూడా ఈ ఫీట్ ని సాధించలేకపోయింది. దీన్ని బట్టి ఈ గ్యాంగ్ స్టర్ మూవీ మీద ఉత్తరాది ప్రేక్షకులు ఏ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
లాంగ్ వీకెండ్ ని టార్గెట్ చేసుకుని మరీ వచ్చిన కెజిఎఫ్ 2 దానికి మించిన ఫలితాలను అందుకుంటోంది. ముఖ్యంగా మెట్రో మాస్ అనే తేడా లేకుండా ప్రతి సెంటర్లోనూ హౌస్ ఫుల్ బోర్డులతో థియేటర్లు కిక్కిరిసిపోతున్నాయి. కర్ణాటక కంటే మిన్నగా బయటే కెజిఎఫ్ 2 అదరగొడుతూ ఉండటం గమనించాల్సిన విషయం. ఫైనల్ రన్ అయ్యేలోపు చాలా చోట్ల ట్రిపులార్ రికార్డులకు సైతం చెక్ పడటం ఖాయమని డిస్ట్రిబ్యూటర్ల అంచనా. దెబ్బకు బీస్ట్ నామరూపాలు లేకుండా పోగా ఆర్ఆర్ఆర్ ఆల్రెడీ నెమ్మదించింది కాబట్టి మరీ తీవ్ర ప్రభావం లేదు. స్క్రీన్లు కంటిన్యూ కావడం వల్ల వీకెండ్స్ కలెక్షన్స్ స్టడీగా ఉండబోతున్నాయి.
ఫస్ట్ పార్ట్ ని మించి అనేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2ని తీర్చిదిద్దిన తీరు మాస్ ఆడియన్స్ కి ఓ రేంజ్ లో కిక్ ఇస్తున్నాయి. కథాపరంగా విషయం తక్కువగా ఉన్నప్పటికీ ఎలివేషన్లను నెవర్ బిఫోర్ అనేలా చూపించిన తీరు క్లాసు మాస్ అందరినీ హాళ్ల దాకా రప్పిస్తున్నాయి. నిన్న అంబెడ్కర్ జయంతి కావడం వల్ల వచ్చిన నేషనల్ హాలిడే చాలా పెద్ద ప్లస్ గా మారింది. ఇవాళ శుక్రవారం గుడ్ ఫ్రైడే, రేపు రెండు రోజులు వారాంతం మొత్తం కెజిఎఫ్ 2 కలిసి వచ్చే అంశమే. సో ఫైనల్ ఫిగర్స్ షాకింగ్ గా ఉండబోతున్నాయనేది వాస్తవం. మరి బాహుబలిని దాటుతుండగా లేదా అనేది అప్పుడే చెప్పలేం. లెట్ సీ