హీరోలు, ఫిల్మ్ మేకర్స్ అందరూ ఇప్పుడు పాన్ ఇండియా జపం చేస్తున్నారు. బహు భాషల్లోకి సినిమాలను డబ్ చేసి రిలీజ్ చేయడం లేదా డైరెక్ట్‌గా రెండు, మూడు భాషల్లో మూవీస్ తీయడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. సొంత భాషతో పాటు మిగిలిన ఏరియాల్లోనూ మార్కెట్ ఏర్పర్చుకోవాలని హీరోలు ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో సినిమాలు తీస్తూ ఏకకాలంలో దేశమంతటా విడుదల చేస్తున్నారు. ఒకవేళ మూవీ హిట్టయితే కలెక్షన్ల వర్షం కురుస్తుంది. పాన్ ఇండియా కాన్సెప్ట్‌కు ఇంత హైప్ తీసుకొచ్చింది దర్శకధీరుడు రాజమౌళినే. ఆయన తెరకెక్కించిన ‘బాహుబలి’ సిరీస్‌తో ఇది మొదలైంది.
‘బాహుబలి’తో నార్త్ మార్కెట్‌పై సౌత్ సినిమాల దండయాత్ర ప్రారంభమైంది. ఆ తర్వాత వచ్చిన ‘కేజీఎఫ్’ సిరీస్‌తో ఇది నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంది. రాకీ భాయ్‌ను బాలీవుడ్ ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. ఈ సిరీస్ నుంచి ఇప్పటికే రెండు చిత్రాలు వచ్చాయి. మూడో భాగాన్ని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే దాని నుంచి అప్డేట్ కోసం యష్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వారి కోసం ఓ క్రేజీ న్యూస్ వచ్చింది. ‘కేజీఎఫ్ ఛాప్టర్-3’ గురించి నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌కు చెందిన అధికార ప్రతినిధి కొత్త అప్డేట్ చెప్పారు.
మూవీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కేజీఎఫ్-3’ మూవీ 2025లో రిలీజ్ కానుందని హోంబలే ఫిల్మ్ ప్రతినిధి తెలిపారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఈ ఏడాది మొదలవుతుందని.. ఇదే విషయాన్ని డిసెంబర్ 21న హోంబలే ఫిల్మ్స్ అఫీషియల్‌గా ప్రకటిస్తుందట. చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను 2024లో ప్రారంభించి.. 2025కల్లా సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తారని సమాచారం. ‘కేజీఎఫ్-2’కు ప్రీక్వెల్‌గా ఛాప్టర్-3ని తెరకెక్కిస్తారట. ఇందులో రాకీ భాయ్ అమెరికా సహా 16 దేశాలను తన గుప్పిట్లో ఉంచుకుంటాడని వినికిడి. మరి.. ‘కేజీఎఫ్ 3’ కోసం మీరు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: విశాల్ ఆరోపణలపై స్పందించిన సెన్సార్ బోర్డు.. ఏమందంటే..?
After Salaar sequels, Hombale Films starts #KGF3 in Oct 2024. A prequel to KGF2, it highlights Rocky Bhai’s adventures in the USA & 16 countries based on ’78-’81 CIA records. pic.twitter.com/oCsNBfnUpk
— LetsCinema (@letscinema) September 29, 2023