iDreamPost
android-app
ios-app

పెళ్లిపీటలెక్కబోతున్న కంగనా.. వైరలవుతున్న ట్వీట్..

  • Author Soma Sekhar Published - 06:37 PM, Wed - 27 September 23
  • Author Soma Sekhar Published - 06:37 PM, Wed - 27 September 23
పెళ్లిపీటలెక్కబోతున్న కంగనా.. వైరలవుతున్న ట్వీట్..

కంగనా రనౌత్.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది వివాదం అనే మాటే. అంతలా ఈ బ్యూటీ కాంట్రవర్సీ క్వీన్ గా బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోలపై, వార్డులపై కామెంట్స్ చేస్తూ.. ఎప్పుడూ వివాదాలతో సావాసం చేస్తుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘చంద్రముఖి 2’ చిత్రం ద్వారా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే కంగనాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే? త్వరలోనే కంగనా పెళ్లిపీటలెక్కబోతోందట. ఇందుకు సంబంధించి ప్రముఖ హిందీ క్రిటిక్ కేఆర్కే చేసిన ట్వీట్ ప్రస్తుతం బీ టౌన్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

కంగనా రనౌత్.. 2006లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. విలక్షణమైన మూవీలు చేస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇక తనదైన నటనతో జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం కంగనా కెరీర్ ఏమంత బాలేదు. కొన్ని సంవత్సరాలుగా ఆమె కెరీర్ లో చెప్పుకోదగ్గ ఒక్క సినిమా రాలేదు. ఇక తాజాగా రాఘవ లారెన్స్ నటించిన చంద్రముఖి 2లో కంగనా కీలక పాత్రచేస్తోంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇదిలా ఉండగా.. ఈ కాంట్రవర్సీ బ్యూటీకి సంబంధించిన ఓ వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కెరీర్ పరంగా డౌన్ అయిన కంగనా.. పెళ్లి చేసుకోవాలని అనుకుంటోందట. కాగా.. కంగనా పెళ్లికి సంబంధించి ప్రముఖ హిందీ క్రిటిక్ కేఆర్కే చేసిన ట్వీట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. కంగనా వివాహ విషయాన్ని చెబుతూ..క్రిటిక్ కేఆర్కే ఈ విధంగా ట్వీట్ చేశాడు. “ప్రముఖ బిజినెస్ మెన్ ను కంగనా త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని, ఈ సంవత్సరం డిసెంబర్ లో ఎంగేజ్ మెంట్ చేసుకుని వచ్చే ఏడాది ఏప్రిల్ లో పెళ్లి చేసుకోబోతున్నారు” అంటూ రాసుకొచ్చాడు. అయితే ఈ వార్తలపై కంగనా స్పందించలేదు. ఇక కంగనా నటించిన తేజస్, ఎమర్జెన్సీ సినిమాలు త్వరలో రిలీజ్ కానున్నాయి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişrekabet girişgrandpashabet