iDreamPost
android-app
ios-app

అనిరుధ్ ట్రాక్ తప్పాడా? ఎక్కడో తేడా కొడుతుంది!

  • Author Soma Sekhar Published - 09:23 PM, Wed - 30 August 23
  • Author Soma Sekhar Published - 09:23 PM, Wed - 30 August 23
అనిరుధ్ ట్రాక్ తప్పాడా? ఎక్కడో తేడా కొడుతుంది!

అనిరుధ్ రవిచందర్.. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరు. తన మ్యూజిక్ తో, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో థియేటర్ లో పూనకాలు తెప్పించడంలో అనిరుధ్ సిద్దహస్తుడు. అంతలా అతడి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంటుంది మరి. ఇక అతడి మ్యూజిక్ కు ఎంత మంది ఫ్యాన్స్ ఉంటారో.. అంతే మంది అతడి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ఉంటారన్నది అతిశయోక్తి కాదు. ఎన్ని కోట్లు అయినా పర్వాలేదు అనిరుధ్ మా మూవీకి మ్యూజిక్ అందించాలని ఎంతో మంది ప్రొడ్యూసర్స్ కోరుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న బిజియోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్ ఒకడు. మరి అలాంటి అనిరుధ్ ట్రాక్ తప్పాడు అంటున్నారు నెటిజన్లు. అతడి మ్యూజిక్ ఎక్కడో తేడాకొడుతోందని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘జైలర్’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమాలో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు పిచ్చెక్కని రజినీ ఫ్యాన్ లేడు అంటే అతిశయోక్తికాదు. అంతా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు అనిరుధ్ రవిచందర్. జైలర్ మూవీ పాటలు యూట్యూబ్ ను షేక్ చేశాయి. ఇక ఈ సినిమాలో అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేరే లెవల్ అనే చెప్పాలి. దీంతో అతడి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. కానీ షారుఖ్ ఖాన్ విషయంలో మాత్రం అనిరుధ్ గాడి తప్పాడని అంటున్నారు బాద్షా ఫ్యాన్స్. దానికి కారణం..

జవాన్ మూవీ నుంచి ఇప్పటి వరకు నాలుగు ఆడియో ట్రాక్ లు రిలీజ్ అయ్యాయి. జిందా బందా, చలేయా, నాట్ రామయ్య వస్తావయ్యాతో పాటుగా ప్రివ్యూ థీమ్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ పాటల్లో ఏ ఒక్క పాట కూడా ఛార్ట్ బస్టర్ అనిపించేలా లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు షారుఖ్ అభిమానులు. జవాన్ మూవీలోని పాటలు వింటుంటే.. ఏదో హడావిడిగా కొట్టేశాడా? అన్న అనుమానం కలుగుతుందని నెటిజన్స్ నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే వెండితెరపై ట్యూన్స్ వేరేలా వినిపిస్తాయా? స్క్రీన్ మీద చూశాక వీరి అభిప్రాయాలు మారుతాయేమో చెప్పలేం కూడా.

కాగా.. తమిళంలో మూవీ అంటే రెచ్చిపోయి, మ్యూజిక్ దంచికొట్టడం అనిరుధ్ కు వెన్నతో పెట్టిన విద్య. ఈ విషయం ఇప్పటికే ఎన్నో సినిమాల్లో రుజువు కూడా అయ్యింది. అయితే ఇతర భాషల్లో మూవీ అంటే అనిరుధ్ తడబడుతుండటం స్పష్టంగా తెలియవస్తూనే ఉంది. తెలుగులో అజ్ఞాతవాసి, జెర్సీ, నాని గ్యాంగ్ లీడర్ కి పని చేసిన అనిరుధ్.. ఆ స్థాయి పాటలను అందించడంలో విఫలం అయ్యాడు. ప్రస్తుతం అనిరుధ్ చేతిలో జూనియర్ ఎన్టీఆర్ దేవర, విజయ్ దేవరకొండ 13 ఉన్నాయి. మరి ఈ సినిమాలకైనా ఛార్ట్ బస్టర్ పాటలు ఇస్తాడో? లేదో? అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. మరి అనిరుధ్ మ్యూజిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.