iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ 7 లోకి ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన మై విలేజ్ షో అనిల్!

  • Author Soma Sekhar Published - 08:39 PM, Wed - 30 August 23
  • Author Soma Sekhar Published - 08:39 PM, Wed - 30 August 23
బిగ్ బాస్ 7 లోకి ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన మై విలేజ్ షో అనిల్!

అనిల్ గీలా.. అంటే ఎవరికీ పెద్దగా తెలీకపోవచ్చు. కానీ మై విలేజ్ షో అనిల్ అంటే.. వెంటనే గుర్తుపట్టేస్తారు. చిన్న యూట్యూబ్ ఛానల్ తో తన కెరీర్ ను ప్రారంభించిన అనిల్.. ప్రస్తుతం ఫేమస్ యూట్యూబర్ గా వెలుగొందుతున్నారు. తన యాస, భాషతో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. గంగవ్వతో కలిసి చేసే వీడియోలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందన్న విషయం మనకు తెలిసిందే. అదీకాక పెద్ద పెద్ద స్టార్లు తమ సినిమా ప్రమోషన్స్ కోసం గంగవ్వ దగ్గరకు వచ్చిన విషయం కూడా తెలిసిందే. అయితే ఫేమస్ యూట్యూబర్ అయిన అనిల్ కు బిగ్ బాస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఇక బిగ్ బాస్ 7కు సంబంధించి ఇంటర్వ్యూలను కూడా పూర్తి చేశాడు అనిల్. తాజాగా ఓ వీడియో ద్వారా బిగ్ బాస్ 7 ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు మై విలేజ్ షో కుర్రాడు.

మై విలేజ్ షో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారు ఉండరు అంటే అతిశయోక్తికాదు. యూట్యూబ్ లో రకరకాల వ్లాగ్స్ చేస్తూ.. ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది మై విలేజ్ షో టీమ్. ‘ఇంతింత వటుడింతై’ అన్నట్లుగా ఈ ఛానల్ ఎదిగింది. ఇక ఈ ఛానల్ లో చేసిన వీడియోస్ తో సెలబ్రిటీగా మారిపోయాడు అనిల్. గంగవ్వతో కలిసి చేసే వీడియోస్ కు ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు. ఇదంతా కాసేపు పక్కన పెడితే.. బిగ్ బాస్ 7 లోకి అనిల్ వెళ్తాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తపై తాజాగా తన యూట్యూబ్ ఛానల్ లో వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చాడు. తనకు బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చిన మాట నిజమేనని, తాను ఇంటర్వ్యూలకు సైతం అటెండ్ అయ్యానని అనిల్ తెలిపాడు.

ఇక తాను బిగ్ బాస్ కు వెళ్లాలా? వద్దా? అన్న విషయంపై తన టీమ్ ను అడిగి తెలుసుకున్నాడు. వారందరు బిగ్ బాస్ కు వెళ్లు అని చెప్పారు. అయితే అనిల్ మాత్రం తాను బిగ్ బాస్ కు వెళ్లట్లేదని స్పష్టంగా చెప్పాడు. దానికి కారణం కూడా ఈ వీడియోలో వివరించాడు. తాను ఓ సినిమా కథను రాసుకున్నానని, ప్రస్తుతం ప్రొడ్యూసర్స్ తో డిస్కషన్ జరుగుతుందని అనిల్ తెలిపాడు. నాకు బిగ్ బాస్ కంటే ఈ మూవీనే ముఖ్యమని.. అందుకే బిగ్ బాస్ కు వెళ్లడం లేదని తెలియజేశాడు. త్వరలోనే తన మూవీకి సంబంధించిన అప్డేట్ ను తన ఛానల్ ద్వారానే వెల్లడిస్తానని చెప్పుకొచ్చాడు అనిల్. మరి మై విలేజ్ షో అనిల్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom