iDreamPost
android-app
ios-app

హీరోయిన్ తో IRS అధికారి రిలేషన్.. గిఫ్ట్ గా భవనాలు, బంగారం!

  • Author Soma Sekhar Published - 02:52 PM, Thu - 31 August 23
  • Author Soma Sekhar Published - 02:52 PM, Thu - 31 August 23
హీరోయిన్ తో IRS అధికారి రిలేషన్.. గిఫ్ట్ గా భవనాలు, బంగారం!

సాధారణంగా హీరో, హీరోయిన్ లేదా హీరోయిన్, డైరెక్టర్ లు లేదా ఇతర నటీ, నటులు రిలేషన్ లో ఉన్నారంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వార్తలు పరిశ్రమలో సర్వసాధారణమే. కానీ IAS, IPS, IRS స్థాయి అధికారులతో హీరోయిన్ లు రిలేషన్ షిప్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి సంబంధించిన ఓ నటిని మనీలాండరింగ్ కేసులో ఈడీ ప్రశ్నించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఓ ఐఆర్ఎస్ అధికారితో సదరు నటి రిలేషన్ లో ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇక రిలేషన్ లో ఉన్నప్పుడు ఆ నటికి గిఫ్ట్ గా బంగారం, బంగ్లాలు ఇచ్చినట్లు విచారణలో తేలింది. మరి ఆ నటి ఎవరు? ఆ IRS అధికారి ఎవరు? ఇప్పుడు తెలుసుకుందాం.

నవ్య నాయర్.. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోయిన్. తాజాగా నవ్య నాయర్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. మనీలాండరింగ్ కేసులో ఈమెను ప్రశ్నించగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐఆర్ఎస్ అధికారి సచిన్ సావంత్.. ఇప్పటికే మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇతడి కాల్ లిస్ట్, చాటింగ్ లిస్ట్ ను చెక్ చేసిన ఈడీ అధికారులకు పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. సచిన్ సావంత్ తో నవ్య నాయర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా ఈడీ గుర్తించింది. దీంతో ఈ కేసులో నవ్య నాయర్ ను ముంబాయికి పిలిపించి ప్రశ్నించిన ఈడీ ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసింది.

నటి నవ్య నాయర్ ను కలిసేందుకు సచిన్ సావంత్ దాదాపు 10 సార్లకు పైగానే కొచ్చిన్ కు వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఇక ఇదే విషయాన్ని ఈడీ ప్రశ్నించగా.. తనకు సచిన్ సావంత్ తో ఎలాంటి సంబంధం లేదని, మేమిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే అని చెప్పడం గమనార్హం. అయితే.. మీకు బంగారం, భవనాలు గిఫ్ట్ గా ఎందుకు ఇచ్చాడు అని ప్రశ్నించడంతో.. కంగుతిన్న నవ్య నాయర్. ఫ్రెడ్షిప్ కు గుర్తుగా ఇచ్చాడని ఆమె తెలిపింది. కాగా.. ఆమె వాంగ్మూలాన్ని ప్రత్యేకంగా కోర్టుకు సమర్పించిన చార్జ్ షీట్ లో ఈడీ జత చేసింది. ఇక హీరోయిన్ తో ఐఆర్ఎస్ అధికారి రిలేషన్ లో ఉన్నాడన్న వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. దీంతో ఎవరీ సచిన్ సావంత్ అంటూ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు.

కాగా.. సచిన్ సావంత్ గతంలో ముంబైలోని జోనల్ ఆఫీస్ లో డిప్యూటీ డైరెక్టర్ (ED)గా నియమించబడ్డాడు. అయితే కొద్ది రోజుల కిందట సీబీఐ అతడిని అవినీతి, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ చేసింది. అతడు అరెస్ట్ అయ్యే నాటికి కస్టమ్స్, జీఎస్టీ అదనపు కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. భారీగా మనీలాండరింగ్ కు పాల్పడి, కోట్ల ఆస్తులను కూడబెట్టినట్లు సీబీఐ గుర్తించింది. సావంత్ తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు పేర్లపై పెద్ద పెద్ద భవనాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో భాగంగానే మలయాళ నటి నవ్య నాయర్ పేరు తెరపైకి వచ్చింది.