iDreamPost
android-app
ios-app

ఇక మొహమాటం లేదు! నో చెప్పేస్తున్న మెగాస్టార్!

ఇక మొహమాటం లేదు! నో చెప్పేస్తున్న మెగాస్టార్!

మెగాస్టార్ చిరంజీవి.. కొన్ని దశాబ్దాలుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ముకుటంలేని మహారాజుగా కొనసాగుతున్నారు. ఒక్కడిగా వచ్చి ఒక శిఖరంలా ఎదిగిన ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. హీరోని చూసి ఇన్ స్పైర్ అయి హీరోలుగా, విలన్లుగా, కొరియోగ్రాఫర్లుగా, డైరెక్టర్లుగా ఇండస్ట్రీకి వచ్చారంటే ఆ ఘనత చిరంజీవికే దక్కుతుంది. చిరంజీవితో సినిమా అంటే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అనే రోజులు అవి. ఒక్క ఛాన్స్ అంటూ టాప్ డైరెక్టర్లు కూడా చిరంజీవి చుట్టూ తిరిగేవారు. అయితే మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత ఆ లెక్క మారిందనే చెప్పాలి.

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఒక రీమేక్ జరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మొదటినుంచి మెగా ఫ్యాన్స్ లో రీమేక్ ల విషయంలో కాస్త కంగారు, కాస్త భయం ఉన్న మాట వాస్తవమే. బాస్ డైరెక్ట్ సినిమా కథలనే ఎంచుకోవాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. కానీ, చిరంజీవి మాత్రం మధ్య మధ్యలో రీమేక్ లతో ప్రేక్షకుల ముందుకు రావడం చూశాం. అయితే ఇటీవల విడుదలైన భోళా శంకర్ సినిమాకి ఏ స్థాయి రిజల్ట్ వచ్చిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ రిజల్ట్ తర్వాత చిరంజీవి ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారని టాలీవుడ్ లో టాక్ మొదలైంది. ఆ సినిమా కథ రీమేక్ కావడం వల్లే ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని ప్రధానంగా వినిపించిన కారణం. అదే పాయింట్ కి బాస్ కూడా కన్విన్స్ అయినట్లుగా చెబుతున్నారు.

ఇకపై రీమేక్ కథలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. మోహన్ లాల్- పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన బ్రో డాడీ సినిమా మెగాస్టార్ రీమేక్ చేస్తారని చాలా రోజులుగా టాక్ నడిచిన విషయం తెలిసిందే. కానీ, బ్రో డాడీ సినిమా విషయంలో చిరంజీవి వెనక్కి తగ్గారని చెబుతున్నారు. అంతేకాకుండా మమ్మూట్టి నటించిన చిత్రం రీమేక్ కోసం ఒక మలయాళం డైరెక్టర్ చిరంజీవిని కలవగా.. ఆయనకు కూడా చిరు నో చెప్పారంట. అంతేకాకుండా.. చుట్టూ ఉండే కొందరు భజన బ్యాచ్ ని కూడా దూరం పెట్టాలని డిసైడ్ అయ్యారంట. ఊరికే పొగిడేస్తూ చుట్టూ చేరి భజన చేసే కొందరిని ఇకపై బాస్ దూరం పెట్టాలని నిర్ణయించుకున్నారని టాక్. ఈ రెండు విషయాలు తెలియగానే మెగా ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో బాస్ రీమేక్స్ ఆపేయాలంటూ కోరుతున్న విషయం తెలిసిందే.

భోళా శంకర్ సినిమా అనౌన్స్ మెంట్ నుంచి రిలీజ్ వరకు ఫ్యాన్స్ ఒకింత అసహనంతో ఉన్నారు. అన్నయ్య కెరీర్ లో ఇదే ఆఖరి రీమేక్ కావాలి అంటూ ఎంతగానో కోరుకున్నారు. అయితే ఇప్పుడు ఈ వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటంతో.. అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారి కోరిక నెరవేరిందని సంబరాలు చేసుకుంటున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రెండు ప్రాజెక్టులు కన్ఫామ్ అయిన విషయం తెలిసిందే. చిరు 156 కుమార్తె సుష్మిత నిర్మాణంలో చేయనున్నారు. ఒక స్ట్రైట్ కథతోనే ఈ ప్రాజెక్ట్ సాగనుంది. ఇంక చిరంజీవి 157 మూవీ బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శక్తవంలో తెరకెక్కనుంది. విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. పంచభూతాల నేపథ్యంలో సాగే కథగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి ఈ రెండు సాలిడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండబోతున్నారు.