iDreamPost
android-app
ios-app

అభిమాని పుట్టినరోజు సెలబ్రేట్ చేసిన బాలకృష్ణ! ఫోటోస్ వైరల్..

  • Author Soma Sekhar Published - 04:05 PM, Tue - 11 July 23
  • Author Soma Sekhar Published - 04:05 PM, Tue - 11 July 23
అభిమాని పుట్టినరోజు సెలబ్రేట్ చేసిన బాలకృష్ణ! ఫోటోస్ వైరల్..

సాధారణంగా అభిమానులు హీరోల బర్త్ డేలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. తమ అభిమాన హీరోపై ఉన్న ప్రేమను ఇలా చాటుకుంటూ ఉంటారు. అయితే ఓ అభిమాని బర్త్ డేను సెలబ్రేట్ చేశారు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(NATA) వేడుకల్లో పాల్గొనడానికి కుటుంబంతో సహా అమెరికా వెళ్లారు బాలయ్య. ఈ వేడుకల్లో ఓ అభిమాని పుట్టినరోజు అని తెలుసుకుని వెంటనే కేక్ తెప్పించి ఆ అభిమాని బర్త్ డేను సెలబ్రేట్ చేశారు.

నందమూరి బాలకృష్ణ.. ఇటు సినిమాలు, అటు రాజకీయాలు.. మరో పక్క సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. తాజాగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(NATA) సభలకు హాజరైయ్యారు బాలయ్య. నాటా సంఘం వారు బాలయ్యను ఈ వేడుకలకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ వేడుకలకు హాజరైన బాలయ్య తనదైన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని బాలయ్య దంపతులను ప్రత్యేకంగా కలిశారు. తన పుట్టినరోజు కావడంతో.. ఆశీర్వాదం తీసుకునేందుకు సదరు యువతి వెళ్లగా.. ఆమె బర్త్ డే అని తెలుసుకుని వెంటనే కేక్ తెప్పించారు బాలయ్య. ఆ యువతి బర్త్ డేను బాలయ్య సెలబ్రేట్ చేశారు. దాంతో ఆమె సంతోషానికి అవధుల్లేవనే చెప్పాలి. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక అభిమానులపై ఎప్పుడూ కోప్పడతాడు, కొడతాడు అని అనేవారికి ఈ ఒక్క సంఘటనతో సమాధానం ఇచ్చారు బాలయ్య. ప్రస్తుతం బాలయ్య.. భగవంత్ కేసరి చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ నటిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్రలో మెరవనుంది. అలాగే బాలయ్య తన 109వ చిత్రాన్ని కూడా ప్రకటించారు. ఈ చిత్రానికి డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తుండగా.. తొలి షెడ్యూల్ సారథి స్టూడియోలో ప్రారంభం కానుంది. మరి ఓ అభిమాని బర్త్ డేను సెలబ్రేట్ చేసిన బాలయ్య ప్రేమ మీకు ఎలా అనిపించిందో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: పవన్‌ కళ్యాణ్‌పై మండిపడుతున్న వాలంటీర్లు.. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss