iDreamPost
android-app
ios-app

అనుష్కను తన ఇంటి కోడలిగా చేసుకోవాలనుకున్న స్టార్ డైరెక్టర్? కానీ..!

  • Author singhj Published - 07:20 PM, Wed - 12 July 23
  • Author singhj Published - 07:20 PM, Wed - 12 July 23
అనుష్కను తన ఇంటి కోడలిగా చేసుకోవాలనుకున్న స్టార్ డైరెక్టర్? కానీ..!

అనుష్క.. సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. అందం, అభినయంతో విశేష గుర్తింపును ఆమె సొంతం చేసుకున్నారు. టాలీవుడ్​లో చాన్నాళ్ల పాటు నంబర్ వన్ హీరోయిన్​గా చక్రం తిప్పారామె. ముఖ్యంగా ప్రభాస్, మహేష్ బాబు, గోపీచంద్, నాగార్జున లాంటి ఎత్తు ఎక్కువగా ఉండే హీరోలకు ఫస్ట్ ఛాయిస్​ ఆమెనే. ఒకవైపు స్టార్ హీరోల సరసన కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు అవకాశం దొరికినప్పుడల్లా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ యాక్ట్ చేశారు. ఈ క్రమంలో ఆమె నటించిన ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’ సినిమాలు సూపర్ హిట్స్​గా నిలిచాయి. అయితే ‘సైజ్ జీరో’ మూవీలో యాక్ట్ చేసేంత వరకు అనుష్క కెరీర్ బ్రహ్మాండంగా సాగింది.

‘సైజ్ జీరో’లో తన క్యారెక్టర్ కోసం బరువు పెరగడంతో అనుష్క చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెయిట్ తగ్గాలని ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత స్వీటీ సినిమాలు చేయడం తగ్గించారు. ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో కలసి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’లో యాక్ట్ చేస్తున్నారీ పొడుగు కాళ్ల సుందరి. అలాంటి అనుష్కను ఒక ప్రముఖ దర్శకుడు తన ఇంటి కోడల్ని చేసుకోవాలని అనుకున్నారట. తన కుమారుడ్ని పెళ్లి చేసుకుంటావా అని అనుష్కను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అడిగారట. అయితే స్వీటీ మాత్రం ఆయన ప్రపోజల్​ను సున్నితంగా తిరస్కరించారట. గతంలో తన కొడుకు ప్రకాష్​కు వివాహం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు రాఘవేంద్రరావు ఫస్ట్ ఛాయిస్​గా అనుష్కను అనుకున్నారట. కానీ ఇదే విషయాన్ని నేరుగా అడిగితే ఆమె సున్నితంగా తిరస్కరించారని రూమర్ వినిపిస్తోంది.

ఇప్పట్లో తనకు మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచన లేదని రాఘవేంద్రరావుకు అనుష్క చెప్పారట. ఆమె నో చెప్పడంతో 2014లో ముంబైకి చెందిన కనికతో ప్రకాష్​కు రాఘవేంద్రరావు పెళ్లి జరిపించారని ప్రచారం జరుగుతోంది. అనంతరం 2017లో ఈ జంట విడాకులు తీసుకోవడంతో మరోసారి అనుష్క వద్దకు పెళ్లి మ్యాటర్ చర్చించేందుకు వెళ్లాలని దర్శకేంద్రుడు భావించారట. అయితే అప్పటికే ఆమె వివాహానికి నో చెప్పడంతో.. మళ్లీ తన అబ్బాయిని చేసుకునేందుకు అనుష్క ఒప్పుకుంటారా అనే సందేహంతో రాఘవేంద్రరావు ఆగిపోయారని టాలీవుడ్ టాక్. గతంలో జరిగిన ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది.

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişMarsbahisHoliganbetJojobet