iDreamPost
android-app
ios-app

‘వేదం’ కాంబినేషన్ రిపీట్.. క్రిష్ తో వన్స్ మోర్ అంటున్న బన్నీ!

  • Author Soma Sekhar Published - 07:53 PM, Fri - 29 September 23
  • Author Soma Sekhar Published - 07:53 PM, Fri - 29 September 23
‘వేదం’ కాంబినేషన్ రిపీట్.. క్రిష్ తో వన్స్ మోర్ అంటున్న బన్నీ!

ఇండస్ట్రీలో కాంబినేషన్లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. పలానా హీరోతో.. పలానా డైరెక్టర్ సినిమా చేస్తున్నాడు అంటే చాలు ఆ మూవీపై భారీగా అంచనాలు పెరిగిపోతాయి. ఇక ప్రేక్షకులు సైతం మరోసారి ఆ హిట్ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తారనడం అతిశయోక్తి కూడా కాదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అలాంటి కాంబినేషనే రాబోతోందని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నాడట. వీరి మూవీకి సంబంధించిన ఓ పోస్టర్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన దృష్టంతా పుష్ఫ 2 మీదే పెట్టాడు. ఈసారి పుష్ప2తో పాన్ ఇండియా రేంజ్ లో కలెక్షన్ల సునామీ సృష్టించాలని బన్నీ చూస్తున్నాడు. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు బన్నీ. ఇక ఈ మూవీ తర్వాత బన్నీ కొన్ని సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కాగా.. మరోటి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో. తాజాగా సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ అట్లీతో కూడా కథా చర్చలు జరిపాడు బన్నీ. ఈ సినిమాలతో పాటుగా తాజాగా లైన్లో ఇంకో సినిమాను పెట్టినట్లుగా తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో ఓ సినిమా చేయబోతున్నాడట బన్నీ.

కాగా.. ఇందుకు సబంధించిన ఓ పోస్టర్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ పోస్టర్ లో ‘కబీ అప్నే, కబీ సప్నే’ ఏ ఫిల్మ్ బై క్రిష్ కమింగ్ సూన్ అంటూ పోస్టర్ లో కనిపించింది. హిందీలో టైటిల్ చూసి.. వీరిద్దరు బాలీవుడ్ లో మూవీ చేస్తున్నారా? అని అడుగుతున్నారు నెటిజన్లు. ఇదిలా ఉండగా.. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ‘వేదం’ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో బన్నీ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మళ్లీ కేబుల్ రాజు లాంటి క్యారెక్టర్ కోసం ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ వస్తుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి క్రిష్-బన్నీ కాంబినేషన్ లో మూవీ వస్తే ఎలా ఉంటుందో? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş