iDreamPost
android-app
ios-app

అలాంటి సైట్లలో తన ఫొటోలు చూసి జాన్వీ కపూర్‌ షాక్‌!

  • Published Sep 29, 2023 | 7:08 PM Updated Updated Sep 29, 2023 | 7:08 PM
  • Published Sep 29, 2023 | 7:08 PMUpdated Sep 29, 2023 | 7:08 PM
అలాంటి సైట్లలో తన ఫొటోలు చూసి జాన్వీ కపూర్‌ షాక్‌!

సినిమా వాళ్ల జీవితాలు విలువులేని వస్తువుల్లా తయారయ్యాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలోని ఆడవాళ్ల వ్యక్తిగత జీవితానికి అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. కొంతమంది దుర్మార్గులు డబ్బు కోసం నటీమణుల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి దారుణాలకు పాల్పడుతున్నారు. పోర్న్‌ సైట్లకు అమ్ముకుంటున్నారు. చిన్న చిన్న నటీమణుల దగ్గరినుంచి స్టార్‌ హీరోయిన్ల వరకూ అందరిదీ ఇదే పరిస్థితి. కొందరు నీచులు స్టార్ల పిల్లలను కూడా వదలటం లేదు.

వారి ఫొటోలను కూడా మార్ఫింగ్‌ చేసేస్తున్నారు. భారత దిగ్గజ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌కు కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. సినిమాల్లోకి రాకముందు ఆమె ఫొటోలను మార్ఫింగ్‌ చేసి కొన్ని పాడు సైట్లలో పెట్టారు. వాటిని చూసి ఆమె షాకైంది. ఈ విషయాన్ని స్వయంగా జాన్వీనే మీడియా ముందు చెప్పుకొచ్చారు. జాన్వీ మాట్లాడుతూ.. ‘‘ నాకు పది సంవత్సరాల వయసు ఉన్నపుడు ఓ పపరజీ నా ఫొటోలు తీశాడు. తర్వాత ఆ ఫొటోలు కొన్ని పాడు సైట్లలో కనిపించాయి.

నేను షాక్‌ అయ్యాను. ఆ ఫొటోలను చూసిన నాకు తెలిసిన వాళ్లు నాకు దూరంగా ఉండటం మొదలుపెట్టారు. ఆఖరికి నాకు చదువు చెప్పే టీచర్ల ఆలోచనల్లో కూడా మార్పు వచ్చింది. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఇలాంటివి చాలా పెరిగాయి. ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలుసుకోవటం కష్టంగా మారింది’’ అని చెప్పుకొచ్చారు. కాగా, జాన్వీ కపూర్‌.. జూనియర్‌ ఎన్టీఆర్‌తో కలిసి ‘దేవర’ అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ శరా వేగంగా జరుగుతోంది. మరి, జాన్వీ కపూర్‌కు ఎదురైన ఈ చేదు అనుభవంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss