iDreamPost
android-app
ios-app

రామ్ చరణ్, అల్లు అర్జున్ లపై ఆసక్తికర కామెంట్స్ చేసిన సముద్రఖని!

  • Author Soma Sekhar Published - 08:12 PM, Fri - 4 August 23
  • Author Soma Sekhar Published - 08:12 PM, Fri - 4 August 23
రామ్ చరణ్, అల్లు అర్జున్ లపై ఆసక్తికర కామెంట్స్ చేసిన సముద్రఖని!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఇతర నటీ, నటులపై సినిమా ఫంక్షన్స్ ల్లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంటారు కొంత మంది నటులు. హీరోలతో తమకు ఉన్న అనుబంధం గురించి సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూ ఉంటారు కొందరు. తాజాగా మెగా పవర్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లను ప్రశంసలతో ముంచెత్తాడు డైరెక్టర్ కమ్ యాక్టర్ సముద్రఖని. బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్, బన్నీలపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. వారితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు సముద్రఖని.

సముద్రఖని.. నటుడిగా, దర్శకుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. భాషలతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఇటీవలే ‘బ్రో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లపై ప్రశంసలు కురిపించాడు. సముద్రఖని మాట్లాడుతూ.. “రామ్ చరణ్, నేను ఆర్ఆర్ఆర్ సినిమాలో కలిసి నటించాం. మేమిద్దరం ఈ సినిమా టైమ్ లో స్నేహితులమయ్యాం. చరణ్ నన్ను బాబాయ్ అని పిలిచేవాడు. క్లీంకార పుట్టినప్పుడు కూడా చరణ్ కు మెసేజ్ పెట్టా. రామ్ చరణ్ ను నా సొంత కొడుకులా భావిస్తా. చరణ్ కు ఏ కష్టం రాకూడదని భావించే వారిలో నేనూ ఉంటా” అంటూ చెప్పుకొచ్చాడు సముద్రఖని.

ఇక అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ..”త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేసిన అల వైకుంఠపురంలో బన్నీతో కలిసి నటించాను. నేను బన్నీని అన్బు అర్జున్ అని పిలుస్తాను. అన్బు అంటే ప్రేమ అని మీనింగ్. ఇక ఈ మూవీ షూటింగ్ టైమ్ లో నన్ను బన్నీ చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే బన్నీ బంగారం లాంటి వ్యక్తి” అంటూ ఇద్దరు హీరోలను ప్రశంసలతో ముంచెత్తాడు. ప్రస్తుతం సముద్రఖని ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోను మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం సముద్రఖని రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా చరణ్ కు అత్యంత సన్నిహితుడిగా ఉండే క్యారెక్టరే అని చెప్పుకొచ్చాడు సముద్రఖని.

ఇదికూడా చదవండి: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న ఈ నగరానికి ఏమైంది యాడ్ చిన్నారి!