iDreamPost
iDreamPost
మొన్న శుక్రవారం చెప్పుకోదగ్గ అంచనాలతో విడుదలైన ఆడవాళ్ళూ మీకు జోహార్లు వసూళ్ల పరంగా నిన్న పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ చేరుకోవడం కష్టమనేలా టాక్ జరుగుతోంది. మంచి ఎంటర్ టైనింగ్ కి స్కోప్ ఉన్న లైన్ ని దర్శకుడు తిరుమల కిషోర్ తన సాగతీత ధోరణితో బోర్ కొట్టించడంతో సూపర్ హిట్ టాక్ రాక ఇబ్బందులు పడుతోంది. శర్వానంద్ పెట్టుకున్న గట్టి నమ్మకం ఆవిరయ్యేలా ఉంది. ప్రధాన కేంద్రాల్లో వీకెండ్ రెండు రోజులు ఆడవాళ్ళ కన్నా ముందు భీమ్లా నాయక్ అడ్వాన్స్ హౌస్ ఫుల్ అవ్వడాన్ని బట్టి చెప్పొచ్చు జనంలో సినిమా గురించి వచ్చిన అభిప్రాయం ఎలా ఉందో.
ఇదంతా ఎలా ఉన్నా మూడు రోజులకు కలిపి ఆడవాళ్లు మీకు జోహార్లు సుమారు 5 కోట్ల 50 లక్షల దాకా షేర్ రాబట్టినట్టు ట్రేడ్ రిపోర్ట్. థియేట్రికల్ బిజినెస్ లెక్కలో చూసుకుంటే ఇంకో పది కోట్ల షేర్ రావాలి. ఏ కోణంలో చూసుకున్నా ఇది అసాధ్యం లాగే కనిపిస్తోంది. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. అలా జరగలేదు. ఇంకో నాలుగు రోజులు మాత్రమే టైం ఉంది. శుక్రవారం రాబోతున్న రాధే శ్యామ్ మీదకు అందరి దృష్టి వెళ్ళిపోయింది. గురువారం సూర్య ఈటి మాస్ ని అట్రాక్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆడవాళ్ళను కాపాడాల్సింది నిజంగానే ఆడవాళ్లు. కానీ వీక్ డేస్ లో వీళ్ళు పోషకులుగా నిలవడం అనుమానమే.
ఏరియాల వారీగా చూసుకుంటే అత్యధిక షేర్ నైజాం నుంచి వచ్చింది. 1 కోటి 85 లక్షలతో అక్కడ బాగానే రాబట్టింది. సీడెడ్ 52 లక్షలు, ఉత్తరాంధ్ర 55 లక్షలు, ఈస్ట్ వెస్ట్ కలిపి 55 లక్షలు, గుంటూరు 32 లక్షలు, కృష్ణా 30 లక్షలు, నెల్లూరు 19 లక్షల దాకా వచ్చినట్టు రిపోర్ట్. ఓవర్సీస్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే కేవలం 80 లక్షలు మాత్రమే వచ్చినట్టు తెలిసింది. రెస్ట్ అఫ్ ఇండియాలోనూ పాతిక లక్షలకు మించి రాలేదు. ఇలాంటి టఫ్ సిచువేషన్ లో ఇంతకన్నా ఎక్కువ ఆశించలేం కానీ ట్రెండ్ చూస్తుంటే ఆడవాళ్లు మీకు జోహార్లు శర్వానంద్ ఫ్లాపుల పరంపరకు బ్రేక్ వేయలేకపోయింది. జానర్ మార్చినా ఫలితం దక్కలేదు
Also Read : NBK & Ravi Teja : సినిమా ఆఫర్ టాక్ షో ఎఫెక్టా