Tirupathi Rao
Pushpa 2 Trailer Decoding: పుష్పరాజ్ గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. ఈ మూవీ ఇప్పుడు పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం సినిమా ప్రేక్షకులు పుష్ప 2 ట్రైలర్ గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే పుష్ప 2 ట్రైలర్ లో ఒక సీన్ చూసిన తర్వాత పెద్ద ఎత్తున చర్చలు స్టార్ట్ అయ్యాయి.
Pushpa 2 Trailer Decoding: పుష్పరాజ్ గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. ఈ మూవీ ఇప్పుడు పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం సినిమా ప్రేక్షకులు పుష్ప 2 ట్రైలర్ గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే పుష్ప 2 ట్రైలర్ లో ఒక సీన్ చూసిన తర్వాత పెద్ద ఎత్తున చర్చలు స్టార్ట్ అయ్యాయి.
Tirupathi Rao
పుష్పరాజ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఎవరిని కదిలించినా ఇదే డైలాగ్ వినిపిస్తోంది. పాట్నాలో ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ఎంత గ్రాండ్ సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాంధీ మైదానం మొత్తం పుష్పరాజ్ అభిమానులతో నిండిపోయింది. దాదాపు 2 లక్షల మంది వరకు హాజరయ్యారని చెబుతున్నారు. ఇసుకేస్తే రాలనంత మంది జనం. ఇండియన్ సినిమాలో ఒక ట్రైలర్ లాంఛ్ కి ఈ రేంజ్ రెస్పాన్స్ అంటే చిన్న విషయం కాదు అనే చెప్పాలి. పుష్ప ట్రైలర్ అటు యూట్యూబ్ లో సంచలనాలు క్రియేట్ చేస్తోంది. కేవలం 15 గంటలలోపే 40 మిలియన్ ప్లస్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. ఒక ట్రైలర్ కి ఈ స్థాయి రెస్పాన్స్ రావడం సౌత్ లో ఇదే తొలిసారి. ట్రైలర్ తోనే పుష్ప రాజ్ ఆల్ టైమ్ రికార్డు నమోదు చేశాడు. అసలు ట్రైలర్ సంగతి పక్కన పెట్టండి.. ఒక్క ఫ్రేమ్ తోనే దేశవ్యాప్తంగా పుష్పరాజ్ గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఆ ఫ్రేమ్ లో ఒక చితి ఉంది. అది పుష్పరాజ్ ది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. నిజంగానే పుష్పరాజ్ చనిపోతాడా?
పుష్ప 2 సినిమా స్పాన్ ఎంతమేర పెంచేశారో ఈ ట్రైలర్ చూశాక క్లారిటీ వచ్చింది. సుకుమార్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్పరాజ్ ఇప్పుడు నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్ అని అర్థమైపోయింది. అంటే పాన్ ఇండియా సినిమా కాదు.. పాన్ వరల్డ్ మూవీగా మారిపోయింది. అలాగే పుష్పరాజ్ కి శత్రువులు కూడా ఇంటర్నేషనల్ అయిపోయారు. పుష్పరాజ్ అటు జపాన్ లో కూడా తన సామ్రాజ్యాన్ని స్థాపించేశాడు. అక్కడ కూడా గట్టిగానే శత్రువులు పుట్టుకొచ్చారు. ట్రైలర్ వైల్డ్ ఫైర్ లా యూట్యూబ్ ని తగలబెట్టేస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే ట్రైలర్ లో ఒక ఫ్రేమ్ గురించి మాత్రం ఇప్పుడు పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఆ ఫ్రేమ్ లో ఎర్ర చందనంతో చితి పేర్చి ఉంది. ఎంపీ, మంగళం శ్రీను, సిండికేట్ సభ్యులు, కొన్ని వందల మంది జనం అక్కడ ఉన్నారు. అంత మంది జనం వచ్చారు అంటే ఆ శవం ఎవరిది అయి ఉంటుంది? అనే ప్రశ్న అందరి మదిని తొలిచేస్తోంది.
ఈ నేపథ్యంలోనే కొన్ని వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఆ సీన్ లో చనిపోయింది పుష్పరాజ్ అయి ఉంటాడు అని కొందరు కామెంట్ చేస్తున్నారు. సినిమాలో ఆ స్థాయి ఎలివేషన్స్ ఇచ్చేంత క్యారెక్టర్ ఇంకెంకవరికి ఉంటుంది అని ప్రశ్నిస్తున్నారు. పుష్పరాజ్ చనిపోయినట్లు చూపించబోతున్నారు అని అభిప్రాయ పడుతున్నారు. అయితే అది నిజమైన మరణం కాదని.. పుష్పరాజ్ క్రియేట్ చేసిన ఫేక్ డెత్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. నిజానికి అది గనుక ఫేక్ డెత్ అయి ఉంటే మాత్రం.. సుకుమార్ ఏదో భారీగానే ప్లాన్ చేశాడు అని చెప్పచ్చు. అలాగే ఇంకొంత మంది పుష్పరాజ్ భార్య శ్రీవల్లి మరణిస్తుందని.. ఆ సీన్ ఆమెకు సంబంధించిందే అని చెబుతున్నారు. గతంలో కూడా పుష్ప 2 సినిమాలో శ్రీవల్లి చనిపోతుంది అనే వార్తలు వచ్చాయి. ఈ సీన్ చూసిన తర్వాత అవి నిజమే అంటున్నారు. పైగా ట్రైలర్ ఒక డైలాగ్ కూడా ఉంది. భార్య మాట వింటే ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపిస్తాను అని పుష్పరాజ్ అంటాడు. తను చనిపోయింది అని చెప్పడానికి ఆ డైలాగ్ బలం చేకూరుస్తోందని కామెంట్ చేస్తున్నారు.
ఇవి రెండు థియరీలు కాకుండా.. మరొకటి కూడా వినిపిస్తోంది. పుష్పరాజ్ తల్లి చనిపోయి ఉంటుంది అంటున్నారు. పుష్పరాజ్ కు తల్లి అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. ఆమె చనిపోవడం వల్లే అంత పెద్దఎత్తున అంత్యక్రియలు ఏర్పాటు చేశారు అని కూడా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇందులో ఏది నిజం అని ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు. కాకపోతే శ్రీవల్లి, పుష్పరాజ్ తల్లి పాత్రలు రెండింటిలో ఎవరు చనిపోయినట్లు చూపించినా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ, పుష్పరాజ్ మాత్రం చనిపోయాడు అంటే మాత్రం ఫ్యాన్స్ ఊరుకునే పరిస్థితి లేదు. అది కేవలం ఫేక్ డెత్ అయి ఉంటుందని చెబుతున్నారు. పైగా పుష్ప పార్ట్ 3 కూడా ఉంటుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు. కాబట్టి పుష్పరాజ్ పాత్రను చంపేసే సాహసం సుక్కు చేయడు అనే చెప్పాలి. మరి.. పుష్పరాజ్ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.